YSRCP: పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై సీఎం సీరియస్.. ఇది తగునా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య తీవ్రమైన విభేధాలు నెలకొన్న విషయం విదితమే.. ఇరు వర్గాలు పరస్పర తీవ్ర ఆరోపణలకు దిగాయి.. అంతేకాదు.. దాడులు కూడా చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, విబేధాల పరిష్కారం కోసం రంగంలోకి దిగిన సీఎం వైఎస్ జగన్.. ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పిలిపించారు.. దీంతో.. ఈ రోజు ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఎంపీ పిల్లి సుభాష్..
Read Also: Priya Prakash Varrier: స్లీవ్ లెస్ టాప్ ధరించి కాక రేపుతున్న ప్రియా ప్రకాష్ వారియర్
Also Read
అయితే, ఈ భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.. రామచంద్రాపురం పంచాయితీపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.. ఎంపీ పిల్లి బోస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. సీఎంతో జరిగిన సమవేశంలో మంత్రి వేణు గోపాలకృష్ణ తీరుపై ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు బోస్.. నియోజకవర్గంలో మంత్రి వేణు సహా ఆయన వర్గీయుల వ్యవహారశైలిని సీఎంకు పిల్లి సుభాష్ వివరించారు. తన అనుచరుడు కోలమూరి శివాజీపై మంత్రి వేణు అనుచరుడు దాడి చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడిని రామచంద్రాపురం నుంచి బరిలో నిలబెట్టాలనే ప్రయత్నాల్లో ఆయన.. మంత్రి వేణుపై జగన్ దగ్గర కంప్లైంట్ చేయబోయారు.. అయితే, అప్పుడే తీవ్ర స్థాయిలో మండిపడ్డారట సీఎం జగన్.. మీ అబ్బాయిని ఎక్కడ నుంచి నిలబెట్టాలనే బాధ్యత నాది కదా అని ప్రశ్నించిన ఆయన.. పార్టీ గెలుపు కోసం రాష్ట్రం అంతా చూడాల్సిన స్థాయిలో ఉండి.. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోవటం కరెక్ట్ కాదని హితవుపలికారు.. విభేదాలను పక్కనబెట్టి కలిసి పని చేసుకోవాలని సూచించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Astrology: అక్టోబర్ 02 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అంతా శుభమే..!
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?