Story Board: శ్రీవారి భక్తులకు సేవలందించడంతో పాటు.. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టిటిడి అనేక ట్రస్ట్ లను ప్రారంభించింది.అందులో ప్రధానమైనవి.. అన్నప్రసాద ట్రస్ట్, ప్రాణదాన ట్రస్ట్, గోసంరక్షణ ట్రస్ట్,వేదపరిరక్షణ ట్రస్ట్. వీటిని ప్రారంభించి ముప్పైకి పైగా సంవత్సరాలు పూర్తి అవుతున్నా..ఒక్క అన్నప్రసాద ట్రస్ట్ కి మాత్రమే ఇప్పటి వరకు 1600 కోట్లు విరాళాలు అందాయి.మిగిలీన ట్రస్ట్ లకు ఇప్పటి వరకు అందిన విరాళాలు వంద కోట్ల రూపాయలకే పరిమితం.మరో వైపు శ్రీవాణి ట్రస్ట్ ప్రారంభించి ఇంకా నాలుగు సంవత్సరాలు పూర్తి కాకుండానే.ఇప్పటికే 880 కోట్ల విరాళాలు అందాయి.టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జారి చేసే టిక్కెట్లను రోజుకి వెయ్యికి పరిమితం చేసినా.. ప్రస్తూతం రోజుకి రమారమి కోటి రూపాయల విరాళాలు ఒక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారానే టిటిడికి సమర్పిస్తున్నారు భక్తులు.ఇలా భక్తులు నుంచి మంచి ఆదరణ పొందిన శ్రీవాణి ట్రస్ట్ నే ఇప్పుడు రాజకీయ నేతలు ఆయుధంగా మార్చుకుంటున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్క దారి పట్టాయంటూ ఆరోపణల పర్వం మొదలు పెట్టేశారు.అసలు ఈ ట్రస్ట్ ని టిటిడి ప్రారంభించిందే నిధులు తాడేపల్లి ప్యాలెస్ కి చేర్చడానికంటు తీవ్రస్థాయిలో ఆధారాలు లేని విమర్శలను చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. వాస్తవానికి శ్రీవాణి ట్రస్టుని ప్రారంభించింది గత ప్రభుత్వ హయాంలోనే.2018 ఆగస్టులో అప్పటి పాలకమండలి ఆలయాల నిర్మాణానికి భక్తుల నుంచి నిధులు సేకరించడానికి శ్రీవాణి ట్రస్టుని ప్రారంభించింది. అప్పట్లో అమరావతిలో 150 కోట్లతో ఆలయ నిర్మాణం చేయవలసి ఉండడంతో.. అందుకు నిధులు సమకూర్చుకోవడానికి శ్రీవాణి ట్రస్టును ప్రారంభించినా..విధివిధానాలను మాత్రం భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు అప్పటి పాలకమండలి. అటు తర్వాత ప్రభుత్వం మారడంతో 2019 అక్టోబర్ లో నూతన పాలకమండలి శ్రీవాణి ట్రస్ట్ విధివిధానాలను ఖరారు చేసింది .పదివేల రూపాయలను భక్తులు విరాళంగా శ్రీవాణి ట్రస్ట్ కి అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేక లేకుండా విఐపి బ్రేక్ దర్శన టికెట్ను కేటాయించే విధానాన్ని ప్రకటించింది టీటీడీ.
శ్రీవాణి ట్రస్ట్ కి వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణం తో పాటు ఆలయ నిర్వహణకు ధూప దీప నైవేద్యం కింద 5000 రూపాయలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తామని ప్రకటించింది టీటీడీ .మరోవైపు అప్పటివరకు విఐపి బ్రేక్ దర్శన టికెట్లు పోందడానికి సిఫార్సు లేఖల కోసం రాజకీయ నేతలను, దళారులను ఆశ్రయించి అధిక ధరలకు టిక్కేట్లు పోందే వారికి శ్రీవాణి ట్రస్ట్ వరంలా మారింది. ఎలాంటి సిఫార్సు లేకూండా నేరుగా శ్రీవారికి సొమ్ములు చెల్లించి ప్రోటోకాల్ తరహాలో స్వామివారి దర్శన భాగ్యం చేసుకునే అవకాశం లభిస్తుందడంతో శ్రీవాణి ట్రస్ట్ కి భక్తుల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. మొదట ఆఫ్ లైన్ విధానంలో ప్రారంభించిన ఈ ట్రస్ట్ టికెట్ల విక్రయాలు వందల సంఖ్యతో ప్రారంభమై.. ఒక దశలో రోజుకి 2500 టికెట్లకు మించి విక్రయాలు జరిగే స్థాయికి చేరుకున్నాయి.దీనితో వీరికి దర్శనం కోసం ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుండడం.. సర్వదర్శనం భక్తులకు దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతూ వచ్చింది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు టీటీడీ శ్రీవాణి టికెట్లను రోజుకు వెయ్యి టికెట్లకు పరిమితం చేసింది .500 టికెట్లను ముందస్తుగా ఆన్లైన్ విధానంలో కేటాయిస్తుండగా.. మరో 500 టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్ విధానంలో కేటాయిస్తుంది .ఆఫ్లైన్ విధానంలో ప్రతినిత్యం తిరుపతి విమానాశ్రయంలో 100 టికెట్లను కేటాయిస్తుండగా.. తిరుమల జేఈవో కార్యాలయంలో మరో 400 టికెట్లను కేటాయిస్తుంది.
టికెట్టు కావలసిన భక్తుడు నేరుగా వస్తే వారి ఆధార్ కార్డు ఆధారంగా టికెట్టు కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది .టిక్కేట్ పై క్యూఆర్ కోడ్ తో పాటు భక్తుడి ఫోటో కూడా ఉంటుంది.పదివేల రూపాయల విరాళాన్ని శ్రీవాణి ట్రస్ట్ కి చెల్లించిన భక్తుడికి విఐపి బ్రేక్ దర్శన టిక్కేట్టు పోందే అవకాశం లభిస్తోంది. వారు మరో 500 రూపాయలు చెల్లిస్తే విఐపి బ్రేక్ దర్శన టిక్కేట్టును టిటిడి కేటాయిస్తుంది .వీటికి సంబంధించిన రసీదును కూడా భక్తుడికి అందజేస్తుంది టిటిడి.ఈ కౌంటర్ నిర్వహణ భాధ్యతలను సంభందింత బ్యాంక్ వారే నిర్వర్తిస్తారు.ఇందులో టిటిడికి సంభందించిన వారి ప్రమేయం ఎక్కడా వుండదు.మరో వైపు భక్తుడు దర్శనానికి వెళ్లే సమయంలో టిక్కేట్టును స్కాన్ చేసిన అనంతరమే దర్శనానికి అనుమతిస్తారు.టిక్కేట్టు కోనుగోలు చేసిన సమయంలో భక్తుడు సమర్పించిన ఆధారాలను సరిచూసుకోని భక్తుడిని దర్శనానికి అనుమతిస్తారు.ఇలా టికెట్టు కేటాయింపు కౌంటర్ కి.. భక్తుడిని దర్శనానికి అనుమతించే కౌంటర్ కి ఆన్ లైన్ విధానంలో అనుసంధానం జరిగి వుంటుంది.దినితో ఎన్ని టిక్కేట్లు జారి అయ్యాయో.ఎవరు వాటిని కోనుగోలు చేసారో..వారినే దర్శనానికి అనుమతించే వ్యవస్థ ఏర్పాటు చేసింది టిటిడి. అసలీ విధానంలో ఎక్కడా అవకతవకలకు తావులేదనేది టీటీడీ చెప్పే మాట. ఎప్పటికప్పుడు డబ్బులు బ్యాంకుల్లో జమ అవుతున్నాయని, లెక్కలు పబ్లిక్ డొమైన్ లో పెట్టామని అంటోంది. భక్తుల్లో అనవసర అనుమానాలు కలిగించడమే లక్ష్యంగా విమర్శలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
శ్రీవాణి టోకెన్లతో టీటీడీకి నిధులొచ్చాయి. భక్తులకు కూడా దర్శన సౌలభ్యం కలుగుతోంది. మామూలుగా వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలు కావాలి. అవి కూడా అంత తేలిగ్గా దొరకవు. దాని కోసం దళారులు, దందాలు మామూలే. ఇప్పుడు శ్రీవాణి వచ్చాక వాటన్నింటికీ అడ్డుకట్ట వేసినట్టైంది. అన్ని తిప్పలు పడకుండా.. పదివేలు కట్టేస్తే.. స్వామిని దగ్గరగా కాస్త ఎక్కువ సమయం చూసే అవకాశం ఉండటంతో.. భక్తుల్లో ఆదరణ పెరిగింది. టికెట్ కు 10 వేల 500 రూపాయలు ఎక్కువ కదా అనేది అంశమే కాదంటున్నారు భక్తులు. స్వామి దర్శనానికి ఎవరూ డబ్బు లెక్కపెట్టరని చెబుతున్నారు. స్వామిని చూసే సమయం.. అయ్యే దర్శనమే ప్రధానమని అభిప్రాయపడుతున్నారు. శ్రీవాణి విధానం ప్రారంభించిన కొద్దికాలంలో ఇంత ఆదరణ రావడానికి ఇదే కారణమనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఇక రేటు విషయానికొస్తే ఇంతకంటే భారీ రేట్లు ఉన్న టికెట్లు మరో 20 ఏళ్ల వరకు అందుబాటులో లేవు. స్వామివారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర కోటి రూపాయలుంది. అయినా సరే 2040 వరకు ఉదయాస్తమాన సేవల టికెట్లు కావాలన్నా లేవు. అయితే శ్రీవాణి విధానంలో దర్శన టికెట్లు తీసుకున్న భక్తులకు ప్రోటోకాల్ ప్రకారం దర్శనం దక్కడం లేదనే వాదన కూడా లేకపోలేదు.