CM YS Jagan: వరుసగా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, స్వయం సహాయక సంఘాలకు కూడా శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యారు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఖరారు అయ్యింది.. ఈనెల 26వ తేదీన అమలాపురంలో పర్యటించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను బటన్ నొక్కి జమ చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ముఖ్యమంత్రి సభకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.
Read Also: Harish Rao: ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో హరీశ్ రావు మీటింగ్.. కొన్ని కీలక నిర్ణయాలు
ఇక, ఏపీ సర్కార్ ఈ మధ్యే రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి) కోసం సున్నా వడ్డీ రుణ పథకాన్ని పునరుద్ధరించింది. స్వయం సహాయక సంఘాలకు రూ.1,400 కోట్లు విడుదల చేస్తూ ఈ పథకాన్ని పునఃప్రారంభించారు సీఎం జగన్.. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 93.80 లక్షల మంది మహిళలు ఉన్న 8.78 లక్షల స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.. సున్నా వడ్డీ పథకం మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రుజువు చేసి, మహిళల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను జాబితా చేశారు. కాగా, ఈ నెల 26వ తేదీన స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.