K Raheja Group: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా.. ఈ సమావేశానికి ఇనార్బిట్ మాల్స్ సీఈవో రజనీష్ మహాజన్, కె రహేజా గ్రూప్ ఆంధ్రా, తెలంగాణా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గోనె శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.. అయితే, విశాఖపట్నంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆహ్వానించారు కె రహేజా గ్రూపు ప్రతినిధులు.. విశాఖపట్నంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నారు.. మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కె రహేజా గ్రూప్ సిద్ధమైంది.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో చర్చించారు కె రహేజా గ్రూపు ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక, మూడు రాజధానులపై ముందుకు సాగుతోన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం విదితమే. విశాఖ పరిపాలన రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని పలు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Read Also: Padi Kaushik Reddy: ఈటల రాజేందర్‌కి ఎమ్మెల్సీ కౌశిక్ సూటి ప్రశ్న.. సమాధానం చెప్పాలని డిమాండ్