అనంతపురం జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. జిల్లాలోని ఊరుకొండ సమీపంలో ఇన్నోవా వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టిన ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం పాలయ్యారు.. వివాహ వేడుక కోసం బళ్లారి నుంచి నింబగల్లుకు వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.. అయితే, ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ.. ప్రమాదంలో మరణించిన వాళ్లలో ఒక్కొక్కరికి రూ.2 లక్షల…
దేశంలో పాలు, పాల ఉత్పత్తులకు కొదవలేదు. ఏ ప్రాంతంలో అయినా 24 గంటలు పాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రస్తుతం దేశంలో లీటరు పాలు రూ. 40 నుంచి రూ.60 వరకు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఎక్కడా పాలు ఉచితంగా ఇవ్వరు. పాలు ఉచితంగా కావాలి అంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి మండలానికి 23 కిమీ దూరంలో చిల్లవారిపల్లి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 400 కుటుంబాలు నివశిస్తున్నాయి. అక్కడ పాలకు ఏ…
ఏపీలో 13 కొత్తజిల్లాలు ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. గతంలో వున్న 13 జిల్లాలకు ఇవి అదనం. మొత్తం 26 జిల్లాలు ఏర్పాటుకానున్నాయి. అనంతపురం జిల్లాలో వున్న ప్రముఖ పుట్టపర్తిని శ్రీ సత్యసాయి జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు శుభపరిణామం అన్నారు. జిల్లా కేంద్రంగా ప్రకటించడం వల్ల ఉద్యోగ వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్ వి జానకీరామయ్య ఆకాంక్ష…
ఈమధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం ఉద్దేహల్ గ్రామ సమీపంలో వంతెనపై ప్రమాదం జరిగింది. తుంగభద్ర ఎగువ కాలువ 115/167 కిలోమీటర్ వద్ద నిర్మించిన వంతెనపై బులేరో లగేజీ ఆటో వస్తుండగా అకస్మాత్తుగా వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో సావిత్రి (30) అనే మహిళ కూలి కాలువలో గల్లంతయింది. మిగతా 29 మంది కూలీలను సురక్షితంగా రక్షించారు స్థానికులు. గల్లంతయిన మహిళా కూలీ కోసం గాలిస్తున్నారు.
ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు.. పురాతన కట్టడాలను, చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కట్టడాలు కింద.. నిధులు ఉన్నాయన్న నమ్మకంతో వాటిని సర్వ నాశనం చేస్తున్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన అనంతలో చారిత్రక సంపద ధ్వంసమవుతోంది. చివరికి లేపాక్షి క్షేత్రాన్ని కూడా వదలకుండా ధ్వంసం చేస్తుంటే, అధికార యంత్రాంగం ఏం చేస్తోందని పురావస్తు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. అనంతపురం జిల్లా పేరుకి కరువు ప్రాంతమైనప్పటికీ.. గతంలో రాజులు పాలించిన ఒక చారిత్రక…
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లపై…రెవెన్యూ అధికారుల దాడులు కొనసాగుతున్నాయ్. చిత్తూరు పలు థియేటర్లకు…అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా నాలుగు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఏపీలో నిబంధనలు పాటించని థియేటర్లపై అధికారులు కొరడా ఝులిపించారు. చిత్తూరు జిల్లాలో 11 థియేటర్లను సీజ్ చేశారు. మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలోని 37 సినిమా హాళ్లకు నోటీసులు ఇచ్చారు. వీటిలో 16 సినిమా థియేటర్లు మూసివేశారు. మదనపల్లిలో ఏడు, కుప్పంలో నాలుగు…
అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం మడకశిర పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది.ఈ చెరువు రాష్ట్రంలోని నైరుతి మూలలో కర్ణాటక సరిహద్దులకు సమీపంలోని ఆనుకుని ఉంది. ఈ చెరువు కర్ణాటకలోని సమీప కాలువల ద్వారా తీసుకువెళ్లే వర్షపునీటిపై ఆధారపడి ఉంది. దశాబ్దాలుగా మడకశిర మునిసిపాలిటీ, సమీప గ్రామాలకు ఇది ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. పట్టణంలోని ప్రజలకు 3కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని అందించేందుకు చెరువుల్లో…
అనంతపురంలో అజ్ఞాత అభిమానుల హడావిడి టీడీపీలో కలకలం రేపుతోందా? పేరు.. ఊరు లేకుండా వెలిసిన ఫ్లెక్సీలు ఇస్తున్న సంకేతాలేంటి? వాటి వెనక పార్టీ ఉందా లేక సామాజికవర్గం కోణం ఉందా? ఇంతకీ ఏంటా ఫ్లెక్సీల గోల..! మల్లాది వాసును కీర్తిస్తూ ఫ్లెక్సీలు..! ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య రాజుకున్న రాజకీయ సెగల్లో.. వేలు పెట్టారు తెలంగాణకు చెందిన మల్లాది వాసు. వనభోజనాల్లో మల్లాది వాసు చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చగా మారాయి. వైసీపీ నేతలు…
దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ అనంతపురం జిల్లా వైద్య శాఖ అప్రమత్తం అవుతుంది. ఇప్పటికే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలను వైద్య శాఖ అధికారులు తీసుకుంటున్నారు. మరోసారి కరోనా ముప్పు రాకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆరోగ్య శాఖ నిఘా పెట్టింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిపై నిఘా పెట్టడంతో పాటు వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 471…
అనంతపురం జిల్లాలో రికార్డులు బద్ధలయ్యాయి. కరువుసీమలో వందేళ్లలో లేనంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఏడాదంతా కురిసే వర్షం నెలరోజుల్లోనే 40 శాతం కురిసింది. భారీ స్థాయిలో వానలు కురవడంతో నష్టం కూడా బాగా పెరిగింది. నిత్యం కరువుతో వుండే ప్రాంతంలో వానలే వానలు. మంచి నీటి కోసం ఇబ్బందులు పడ్డవారు ఇప్పుడు వాటర్ పైప్ లైన్లు పాడయిపోయాయి. ఎడతెరిపి లేని వానలతో కనీవీనీ ఎరుగని రీతిలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ప్రాణాలు కూడా పోయాయి. 150…