అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శుక్రవారం మడకశిర పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది.ఈ చెరువు రాష్ట్రంలోని నైరుతి మూలలో కర్ణాటక సరిహద్దులకు సమీపంలోని ఆనుకుని ఉంది. ఈ చెరువు కర్ణాటకలోని సమీప కాలువల ద్వారా తీసుకువెళ్లే వర్షపునీటిపై ఆధారపడి ఉంది. దశాబ్దాలుగా మడకశిర మునిసిపాలిటీ, సమీప గ్రామాలకు ఇది ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. పట్టణంలోని ప్రజలకు 3కిలోమీటర్ల దూరం నుంచి తాగునీటిని అందించేందుకు చెరువుల్లో వేసిన బోరు బావుల ద్వారా నీటినిసరఫరా చేస్తున్నారు. భారీ వర్షాలకు తోడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర ప్రాంతానికి నీటిని తీసుకెళ్లే హంద్రీ నీవా సుజల స్రవంతి రెండో దశ సాగునీటి ప్రాజెక్టుకు సైతం నాలుగు దశాబ్దాల తర్వాత పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరింది.
మడకశిరలో పండుగ వాతావరణం
రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో నీటి వనరులు తక్కువగా ఉన్న సమయంలో మడకశిరకు నీటి ఇబ్బందులు ఏర్పడలేదు. గత కొన్ని దశాబ్దాలుగా భూగర్భ జల వనరులు క్షీణించడం,కరువు ఏర్పడినప్పుడు కూడా ప్రజలు నీటికోసం అంతగా ఇబ్బందులు పడలేదు. అయితే 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు చెరువు పూర్వ జళకళను సంతరించుకోవడంతో మడకశిర వేడుకలను అక్కడి ప్రజలు నిర్వహించుకున్నారు. దాదాపు కొన్నేళ్లుగా అక్కడి తాగు అవసరాలకు ఈ చెరువే ఆధారం అయింది. ఏది ఏమైనా చెరువు నీటి మట్టం పూర్తి స్థాయిలో చేరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ చిన్న నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న బలరాం 40 ఏళ్ల కిందట మడకశిర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. “నా ఊరికి ఇది ఒక ప్రత్యేక సందర్భం. 40 ఏళ్ల కిందట పెద్ద చెరువు పొంగిపొర్లడాన్ని చూసి పట్టణవాసులంతా సంబరాలు చేసుకున్నారు, ఇప్పుడు మళ్లీ పెద్ద చెరువు పొంగిపొర్లుతోంది” అని ఆయన ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం:ఎమ్మెల్యే తిప్పేస్వామి
ఈ సందర్భంగా మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత గుండుమల తిప్పేస్వామి చెరువును సందర్శించారు. రెండు పార్టీలు కృష్ణా నీటిని టెయిల్ ఎండ్ వరకు, ఏపీలోని ఎత్తైన ప్రాంతానికి తీసుకురాగలిగామని వారు అన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ చెరువు ప్రాంతాన్ని ట్యాంక్ బండ్‌గా రీతీలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. పెద్ద చెరువుకు సమీపంలో పర్యాటక కేంద్రానికి ముఖ్యమంత్రి జగన్ అనుమతి ఇవ్వడంతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని ఎమ్మెల్యే చెప్పారు.