తెలుగు రాష్ట్రాల్లో వరుస పరువు హత్యలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రేమ పేరుతో ముడిపడిన బంధాలు.విడిపోయి బతకడం ఇష్టంలేక ఇద్దరు కలిసి వుండాలనే నేపథ్యంలో పెళ్ళి చేసుకుని ఆనందంగా గడిపినా తల్లిదండ్రులు ఓర్వలేని స్థితిలో వుంటున్నారు. కులాలు వేరని, తక్కువ కులం ఎక్కువ కులం మంటూ పరువు ప్రతిష్టలకు పోయి పిల్లల ప్రాణాలను సైతం తీసేందుకు వెనుకాడటం లేదు. ఇరుగుపొరుగు వారు ఏమనుకుంటారు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తాను అతనితో బతకడం కన్నా చావడం మేలంటూ హత్య చేస్తున్నారు. తెలంగాణ…
దేశంలో వైద్య ఆరోగ్య రంగానికి మోడీ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే. కోవిడ్ వచ్చే సమయానికి దేశంలో ఆస్పత్రులు పరిస్థితి అంత మెరుగ్గా లేదు. రెండేళ్లలో దేశంలోని ఆసుపత్రులలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. వైద్య రంగానికి ప్రధానమంత్రి మోడీ పెద్ద పీట వేశారన్నారు. అనంతపురం పర్యటనలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే కోవిడ్ మరణాలు దేశంలో తక్కువ అన్నార. కోవిడ్ వ్యాక్సిన్ తో పాటు…
శంకర్ నారాయణ. సీఎం జగన్ కేబినెట్ వన్‌లో అనుకోకుండా చోటు సంపాదించిన మంత్రుల్లో ఒకరు. అనంతపురం జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్న కురుబ సామాజికవర్గం కావడంతో ఎలాంటి ప్రయత్నం చేయకుండానే 2019లో మినిస్టర్ అయ్యారు. మంత్రిగా ఉన్నన్ని రోజులు బాగానే నడిచింది. పెనుకొండ నియోజకవర్గంలో చాపకింద నీరులా ఉన్న వర్గపోరు.. శంకరనారాయణ మంత్రి పదవి పోయాక కానీ బయట పడలేదు. ఎవరైతే ఆయన గెలుపునకు బ్యాక్ బోన్‌గా ఉన్నరో వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారారట. శంకరనారాయణ మంత్రిగా…
మూడు దశాబ్దాల క్రితం రాయలసీమలోని తాడిపత్రిలో జరిగిన ఓ హత్యను ఆధారంగా చేసుకుని ‘రెక్కీ’ వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ హత్య, తదనంతర పరిణామాలతో ఈ మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ ను పోలూరి కృష్ణ తీశారు. ఇరవై ఐదు నిమిషాల నిడివితో ఏడు ఎపిసోడ్స్ గా రూపుదిద్దుకున్న ‘రెక్కీ’ని జూన్ 17న జీ 5లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. పోలీస్ ఇన్ స్పెక్టర్ లెనిన్ గా శ్రీరామ్ నటించగా, శివ బాలాజీ, ధన్యా…
గతంలో నేతలు పాదయాత్రలు చేస్తే.. వారి తనయులు వారిలాగే పాదయాత్రలకు పూనుకున్నారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ అధినేత, వైఎస్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. 2019లో ఆయన అధికారం హస్తగతం చేసుకున్నారు. రెండుసార్లు తండ్రితనయులు పాదయాత్రల ద్వారా అత్యున్నత పీఠం అధిరోహించారు. అదే రీతిలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేసి అధికారం పొందారు. చంద్రబాబు బాటలోనే ఆయన…
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం, ములకలేడు గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షత గాత్రును చికిత్సనిమిత్తం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఇవాళ (శనివారం) వేకువజామున 5 గంటల సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైనున్న మిద్దె కప్పు కూలి.. నిద్రిస్తున్న వారిపై పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్థులు ఘటనాస్థలానికి…
ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు . తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు…
అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాజకీయం హాట్ హాట్ గా వుంటుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం మామూలుగా వుండదు. తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దీక్షకు దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ ముందు జేసీ దీక్షకు దిగారు.…