అనంతపురంజిల్లా విడపనకల్ గ్రామానికి చెందిన హిజ్రా అనుష్క @ హనుమప్పకు చెందిన ఇంటిలో 31.08.2021 వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువా మరియు గూట్లో దాచి ఉంచిన 6.5 తులాల బంగారు నగలు మరియు నగదు Rs.4,00,000/- లను దొంగలించుకెళ్లారు. ఈ కేసులో ఉరవకొండ C.I B. శేఖర్ నిందితుడిని అరెస్ట్ చేసి దొంగలించిన మొత్తము సొత్తు విలువ Rs.7,20,000/- లను రికవరీ చేశారు. ఇందుకు కృతజ్ఞతగా హిజ్రాల సంఘం ఉరవకొండ…
కంచుకోట లాంటి జిల్లాలో ప్రస్తుతం వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది టీడీపీ. పార్టీ వేదికలపైనే వైరిపక్షాల్లా మాటలు దూసుకుంటున్నారు నేతలు. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఇంతకీ ఏంటా జిల్లా? ఎందుకు తమ్ముళ్లు కట్టు తప్పుతున్నారు? లెట్స్ వాచ్! జేసీకి వ్యతిరేకంగా ఒక్కటైన పాత టీడీపీ లీడర్లు! అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. మొన్నటికి మొన్న రాయలసీమ టీడీపీ నేతలంతా ఉన్న వేదికపైనే తాడిపత్రి…
ఆ జిల్లాలో మొన్నటి వరకు ఒక్కరే పెత్తనం చేసేవారు. అధికారులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అధికార పార్టీలో గ్రూపులు పెరిగి.. ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. తిరుగుబాటులు మొదలయ్యాయి. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఎవరూ పట్టించుకోవడం లేదని అధికారపార్టీ నేతలు జూలు విదిల్చారా? పదేళ్లు అధికారంలో లేం. పవర్‌లోకి వచ్చాక చెబుతాం. రెండేళ్ల క్రితం వైసీపీ నేతల వాయిస్ ఇది. కానీ.. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల…
ఒక చిన్న ఇల్లు, మూడు బల్బులు, ఒక ఫ్యాన్, ఒక టీవి… ఇలాంటి ఇంటికి నెలకు కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. మామూలుగా అయితే రూ.200 వరకు వస్తుంది. అయితే, అలాంటి ఇంటికి ఏకంగా లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. ఆ బిల్లును చూసిన ఇంటి యజమానికి గుండెనొప్పి వచ్చినంత పనైంది. వెంటనే విద్యుత్ శాఖాధికారుల దగ్గరకు వెళ్లి బిల్లు చూపించి ఇదేంటని అడిగితే… కట్టాల్సిందే అన్నారట. కావాలంటే కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పారట. ఈ సంఘటన…
వారిద్దరూ మాజీ ప్రజాప్రతినిధులు. ఒకరు మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు మాజీ ఎమ్మెల్సీ. ఒకే పార్టీ. ఒకే నియోజకవర్గం. నిన్న మొన్నటి వరకు కలిసే ఉన్నా.. ఇగో క్లాష్‌తో గ్యాప్ వచ్చింది. ఒక్కటిగా ఉన్నవారు ఇప్పుడు రెండు దుకాణాలు తెరిచారు. ఎవరి కుంపటి వారిదే. పార్టీ అధికారంలో లేకపోయినా ఓ రేంజ్‌లో అధిపత్యపోరుకు దిగుతున్న ఆ నాయకులెవరో ఈ స్టోరీలో చూద్దాం. రెండు వర్గాలుగా చీలిన మడకశిర టీడీపీ! అనంతపురం జిల్లా టీడీపీ వర్గవిభేదాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పటికే…
అధికారంలో లేకపోయినా సరే అస్సలు తగ్గట్లేదు. అదే పంతాలు.. అవే పట్టింపులు. ప్రస్తుతం ఆ పార్లమెంట్ పరిధిలోని టీడీపీ నేతల తీరు అలాగే ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఇప్పుడేంటో కూడా తెలియదు. అయినప్పటికీ అక్కడి నేతలు తాము చెప్పిన వారికే పదవులు ఇవ్వాలని పంతం పడుతున్నారట. ఫలితంగా పార్లమెంట్ కమిటీ ఎంపికను అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈసారి మాత్రం సరికొత్త వ్యూహాం రచిస్తోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురంలో పార్టీ కమిటీ ఏర్పాటులో టీడీపీ…
పార్టీ అధికారంలో లేకపోయినా కయ్యానికి కాలు దువ్వడానికి ఏ మాత్రం సంకోచించడం లేదట తెలుగు తమ్ముళ్లు. పార్టీ పెద్దల దగ్గర ‘రాజీ’ పడుతున్నట్టు చెబుతున్నా.. బయటకొచ్చాక కుస్తీలే. దీంతో టీడీపీ అధిష్ఠానం కూడా ఆ నియోజకవర్గాలను వదిలేసిందని ప్రచారం జరుగుతోంది. ఎందుకో ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. టీడీపీ పెద్దలకు మింగుడు పడని వర్గపోరు! ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోటల్లో అనంతపురం జిల్లా కూడా ఒకటి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ రెండుచోట్లే గెలిచింది. మిగతాచోట్ల…
అనంతపురం జిల్లా ఎస్పీగా ఫక్కీరప్ప బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫక్కీరప్ప మాట్లాడుతూ… శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన పరిస్థితులు ఉంటాయి అని తెలిపారు. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉండేలా చూస్తాను. పాత ఎస్పీ సత్య ఏసుబాబు చేపట్టిన కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ రాయలసీమలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో సీఎం పర్యటన ఉంటుంది. జూలై 8న ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. పది గంటల ప్రాంతంలో పుట్టపర్తిలో విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రాయదుర్గం చేరుకుని ఉదేగోలం గ్రామంలో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. వైఎస్సార్ ఆర్బీకే ప్రారంభించటంతో పాటు వ్యవసాయ అధికారులు, సిబ్బందితో ఇంటరాక్ట్ అవుతారు.…
బాలయ్య పుట్టిన రోజు వేడుకలునేడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని హిందూపురంలోని ఆయన నివాసం వద్ద తెదేపా నాయకులు, అభిమానులు జన్మదిన వేడుకలు నిర్వహించనున్నారు. వాహనం దగ్ధంఅనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఓబులేసు కోన మలుపు వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ వాహనం పూర్తిగా దగ్ధమైంది. పాస్ పోర్టు సేవలు పునఃప్రారంభంఅనంతపురం జిల్లాలో ఈనెల 11 నుంచి ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్ పోర్టు…