ఈమధ్యకాలంలో ఐటీ శాఖ వరుస దాడులతో కలకలం రేపుతోంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డవారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ఆదాయపన్ను శాఖ దాడులు కొందరు వ్యాపారుల్ని వణికించాయి. ఆదాయానికి మించి ఆస్తులు , పెద్ద మొత్తంలో భూములు కోనుగోలు చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తిరుపతికి చెందిన ఐటి శాఖ అధికారులు వడ్డీ వ్యాపారి ఇంట్లో దాడులు నిర్వహించారు . తుమ్మళ్లకుంటకు చెందిన రమణారెడ్డి అలియాస్ పంచె రెడ్డి 1991లో గ్రామంలో ఉన్న రెండు…
అనంతపురం జిల్లాలో తాడిపత్రి రాజకీయం హాట్ హాట్ గా వుంటుంది. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహారం మామూలుగా వుండదు. తాడిపత్రిలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య మళ్లీ వార్ మొదలైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై మళ్లీ విరుచుకుపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ దీక్షకు దిగారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అనంతపురం రీజనల్ డైరెక్టర్ ఆఫీస్ ముందు జేసీ దీక్షకు దిగారు.…
ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
ఆడవారిపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటున్నా ఫలితం సూన్యంగా మారుతోంది. మహిళలకు ఏదైన ఇబ్బందులు ఎదురైతే రక్షణ కవచలంగా వుండాల్సిన రక్షభటులే మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే అనంతపురం జిల్లా పామిడి మండలం జీ.ఏ కొట్టాల గ్రామంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే .. అనంతపురం జిల్లా పామిడి మండలంలోని జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన బీమ్లా నాయక్ కుమారుడు విజయ్ కుమార్ నాయక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై గా…
రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఒక్కర్ని బుజ్జగిస్తే.. మరో ఇద్దరు తెరపైకి వస్తున్నారు. తాజాగా ఈ పునర్వ్యస్థీకరణ రచ్చ.. అనంతపురం జిల్లాను కూడా తాకింది. నిన్నటి వరకు జిల్లాలో ఎలాంటి అలజడులు కనిపించ లేదు కానీ.. ఇప్పుడు ఏకంగా ఆవివాదం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంద్ లకు కూడా దారి తీసింది. ఏపీలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ వైసీపీకి పెద్ద తలనొప్పిలా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా…
అనంతపురం జిల్లా మన్నీల రచ్చబండ లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రైతు నేపథ్యం నుంచి వచ్చా… రైతు కష్టం తెలిసిన వాడిని.కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఆదరణ లేక… గిట్టుబాటు కాక నిరాశ నిస్పృహ లో ఆత్మహత్య కు పాల్పడుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే కన్నీళ్లు తుడవలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి… లక్షల కోట్లు ఉంటే ఏమి లాభం? కౌలు రైతు, రైతులకు కులం ఉండదు. ఒకప్పుడు నేను ఇంటర్ లో బాగా…
సాగు నష్టాలు,ఆర్ధిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కలుగురి రామకృష్ణ కుటుంబాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించారు.అనంతపురం జిల్లాధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లిలో ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా.. కుల మతాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. కుల జాఢ్యం ఇంకా వేధిస్తూనే ఉంది.. కులం మత్తులో ఇంకా కొంతమంది ప్రాణాలు తీస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లికి చెందిన గొల్ల నరేంద్ర.. అదే గ్రామంలోని బోయ సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించకపోడంతో.. వారిని ఎదిరించి రెండేళ్ల…
ఆ ప్రాంతంలో జిల్లా విభజనపై ఒక రేంజ్లో ఉద్యమం జరుగుతుంటే.. ఒక మంత్రి.. ప్రతిపక్షపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాత్రం సైలెంట్ అయ్యారు. మొన్నటి వరకు మాకు ఓటేయండి.. మన ఊరిని జిల్లా కేంద్రం చేయిస్తామని హామీలు ఇచ్చిన నేతలు ఇప్పుడు నోరు మెదపడం లేదు. నేతలను కదిపితే నోకామెంట్ అంటున్నారట. ఆ ప్రాంత నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో పెనుకొండే ప్రచార అస్త్రం అనంతలో జిల్లాల విభజనపై జరుగుతున్న రచ్చ అంతా ఇంతా…
సాధారణంగా మనకు పాములు కనిపిస్తే ఆమడదూరం పరిగెడతాం. పాము అంటే విషజంతువు అని మన మైండ్‌లో ఫిక్స్ అయింది. అందుకే అవి కనిపిస్తే చాలు బాబోయ్ అంటూ పరుగులు తీస్తాం. ధైర్యం ఉన్నవాళ్లైతే కర్రతో కొట్టి చంపేస్తాం లేదా, స్నేక్ క్యాచర్స్ కి ఫోన్ చేసి పిలుస్తాం. కానీ, ఈ వ్యక్తికి పాములంటే మహా ఇష్టం. అవి కనిపిస్తే చాలు వాటిని చకచకా తినేస్తాడు. పచ్చిగానే తినేస్తాడట. అయితే, ఇతనికో సద్గుణం ఉంది. పాముల్ని అతను చంపడు.…