సాధారణంగా మనకు పాములు కనిపిస్తే ఆమడదూరం పరిగెడతాం. పాము అంటే విషజంతువు అని మన మైండ్‌లో ఫిక్స్ అయింది. అందుకే అవి కనిపిస్తే చాలు బాబోయ్ అంటూ పరుగులు తీస్తాం. ధైర్యం ఉన్నవాళ్లైతే కర్రతో కొట్టి చంపేస్తాం లేదా, స్నేక్ క్యాచర్స్ కి ఫోన్ చేసి పిలుస్తాం. కానీ, ఈ వ్యక్తికి పాములంటే మహా ఇష్టం. అవి కనిపిస్తే చాలు వాటిని చకచకా తినేస్తాడు. పచ్చిగానే తినేస్తాడట. అయితే, ఇతనికో సద్గుణం ఉంది. పాముల్ని అతను చంపడు. చంపి తింటే పాపంగా భావిస్తాడు. ఎవరైనా చంపి పడేస్తే వాటిని శుభ్రంగా తినేస్తాడు.
Read: టుడే ఎన్టీవీ టాప్ న్యూస్
పాములు విష జంతువులు కదా అతనికి ఏమీ కాదా అంటే, కాదని చెబుతున్నాడు. చనిపోయిన పాముల్ని తింటానని, ఇప్పటి వరకు తనకేమి కాలేదని చెబుతున్నాడు అనంతపురం జిల్లా శనగలగూడూరు గ్రామానికి చెందిన పుల్లన్న అనే వ్యక్తి. పుల్లన్న పాములు తింటున్న దృశ్యాలను అక్కడి వ్యక్తులు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.