అమెరికా దక్షిణ రాష్ట్రమైన అలబామాలోని హైవే సమీపంలో మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ కూలిపోవడంతో బుధవారం ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు అధికారులు తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి కొండ మీద నుంచి లోయలోకి పడింది. ఈ ప్రమాదంలో 39 మంది వలసదారులు మృతి చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
2024లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి తాను పోటీ చేస్తున్నట్లు భారతీయ-అమెరికన్, అమెరికా రాజకీయవేత్త నిక్కీ హేలీ ప్రకటించారు. దీంతో, వైట్‌హౌస్‌కు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేసిన మొదటి రిపబ్లికన్‌గా ఆమె అవతరించారు.
అగ్రరాజ్యమైన అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలో ఈస్ట్ లాన్సింగ్లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
గగనతలంలో గుర్తు తెలియని వస్తువులపై అమెరికా దండయాత్ర కొనసాగుతోంది. ఆదివారం మరో వస్తువును అమెరికా వాయుసేన కూల్చివేసింది. దానికి ముందురోజే కెనడా గగనతలంలో ఇలాంటి ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
Semiconductors : ప్రపంచంలో యుద్ధం ఇప్పుడు దేశ సరిహద్దుల్లో మాత్రమే జరగదు. ఈ కొత్త యుద్ధం ప్రస్తుతం ఆర్థిక రంగంలో ప్రారంభమైంది. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్కెట్ శక్తులను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నైపుణ్యం అనే ఆయుధాన్ని ఉపయోగించి ఈ యుద్ధం జరుగుతోంది.
ఇటీవల చిన్నా పెద్దా లేకుండా గుండె సంబంధ వ్యాధులతో జనాలు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. బాస్కెట్‌బాల్ ఆడుతూనే ఓ పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో చోటుచేసుకుంది.
Chinese spy balloon: అణ్వాయుధ స్థావరాలు మీదుగా ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్ను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ గుర్తించింది. అధ్యక్షుడు జో బైడెన్ సూచన మేరకు డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్, ఉన్నత సైనిక అధికారులు బెలూన్ను పేల్చివేయాలని భావించారు