New Covid Variant: ప్రపంచాన్ని మూడేళ్లుగా గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఇండియాతోపాటు చాలా దేశాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. కొత్త కరోనా వేరియంట్ ఏదీ లేకపోవడంతో ప్రజలు సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమయంలో అమెరికాలో కరోనా కొత్త వేరియంట్ బటయపడింది. అమెరికాలో బయటపడిన కొత్త వేరియంట్‌ను EG.5గా గుర్తించారు. అమెరికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. కొత్తగా పుట్టుకొచ్చిన ఈజీ. 5 (EG.5) వేరియంట్ 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. అగ్రరాజ్యం అమెరికా (America)లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇటీవలే పుట్టుకొచ్చిన ఈజీ. 5 (EG.5) వేరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతోందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది.
Read also: Sobitha Dhulipalla: వింత జాకెట్టులో శోభిత హాట్ ట్రీట్.. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే!
ఈ కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ జాతికి చెందిన ఎక్స్‌బీబీ 1.9.2 (XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్‌బీబీ 1.9.2 స్ట్రెయిన్‌తో పోలిస్తే ఈజీ.5లోని స్పైక్ ప్రోటీన్‌లో ఒక జన్యుమార్పు (మ్యూటేషన్) అదనంగా ఉన్నట్టు గుర్తించినట్లు సైంటిస్టులు చెప్పారు. ఈ కొత్త మ్యూటేషన్ గతంలో ఇతర కరోనా వేరియంట్లలో కూడా గుర్తించామని వారు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈజీ.5 కాకుండా ఎరిస్ (Eric) లేదా ఈజీ.5.1 (EG.5.1) అని పిలవబడే మరో కొత్త వేరియంట్ కూడా ప్రస్తుతం వేగంగా వ్యాపిస్తోందని.. కొవిడ్-19 (Covid-19)లో ఒమిక్రాన్ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 (EG.5.1) ప్రస్తుతం బ్రిటన్ (UK)ని వణికిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఆ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు యూకే ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 14.6 శాతం అవే కేసులు ఉన్నట్టు వారు ధృవీకరించారు. బ్రిటన్ ను భయపెట్టిస్తున్న కొత్త వేరియంట్ భారత్ లో కూడా విజృంభిస్తోందని.. ఎరిస్ అని పిలిచే ఈ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కనిపించిన వ్యాధి లక్షణాలే.. ఇంచుమించుగా ఈ కొత్త వేరియంట్ సంక్రమించిన వారిలో కూడా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ముక్కు కారడం, తీవ్రమైన తల నొప్పి, గొంతు నొప్పి, తుమ్ములు, ఆయాసం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయని, కొత్త వేరియంట్ ఎరిస్ సోకిన వారిలో ఈ లక్షణాలే కామన్‌గా ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.