Aruna Millar: అగ్రరాజ్యంలో మరోసారి భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణా మిల్లర్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. అరుణ మేరీలాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్.
అమెరికా తన సొంత యుద్ధ ట్యాంకులను పంపడానికి అంగీకరిస్తే రష్యాకు వ్యతిరేకంగా రక్షించడంలో సహాయపడటానికి జర్మనీ తయారు చేసిన ట్యాంకులను ఉక్రెయిన్కు పంపడానికి జర్మనీ అనుమతిస్తుందని బెర్లిన్ ప్రభుత్వం ప్రకటించింది.
Pakistan may lose major non-Nato ally status: పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది దాయాది దేశం పాకిస్తాన్. తమను రక్షించాలని పాశ్చాత్య దేశాలను అడుక్కుంటోంది. అక్కడి ప్రజలు కనీసం గోధుమ పిండి కూడా దొరకడం లేదు. గోధుమ పిండి కోసం అక్కడ ప్రజలు కొట్లాడుతున్నారు.
Indians See US As Biggest Military Threat After China, says Survey: భారత దేశానికి సైనిక పరంగా ముప్పు చైనా నుంచి పొంచి ఉందనేది అందరికి తెలిసిన విషయమే. చైనా నుంచే అతిపెద్ద సైనిక ముప్పు పొంచి ఉందని భారతీయులు విశ్వసిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. అయితే ఆ తరువాతి స్థానంలో అంతా పాకిస్తాన్ ఉంటుందని అనుకుంటారు.. కానీ, రెండో స్థానంలో అమెరికా నుంచి సైనిక ముప్పు ఉందని భారతీయులు ఓ సర్వేలో తెలిపారు.…
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) సోమవారం పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీని ఐఎస్ఐఎల్ (దాయెష్), అల్-ఖైదా ఆంక్షల కమిటీ కింద గ్లోబల్ టెర్రరిస్ట్గా జాబితా చేసింది.
పార వీసాల జారీని వేగవంతం చేయాలని భారతదేశం అమెరికాను అభ్యర్థించిందని, తద్వారా ప్రజలు తమ వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలను కొనసాగించేందుకు ప్రయాణాలను చేపట్టవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం తెలిపారు.
పాశ్చాత్య శక్తులు ఆయుధాల సరఫరాను, ముఖ్యంగా సుదూర క్షిపణి వ్యవస్థలను పెంచినట్లయితే ఉక్రెయిన్ ఈ సంవత్సరం యుద్ధంలో విజయం సాధించగలదని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ బుధవారం వెల్లడించారు.
అగ్రరాజ్యమైన అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టమ్లో భారీ సాంకేతిక లోపం కారణంగా అమెరికా అంతటా అన్ని విమానాలు నిలిపివేయబడ్డాయని బుధవారం వార్తా నివేదికలు వెల్లడించాయి.