అమెరికా-కెనడా మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొనేలా ఉన్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితులు తారుమారు అయినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’’పై కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
అగ్ర రాజ్యం అమెరికాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్రమ వలసదారుల్ని పట్టుకునే క్రమంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అమానుష్య చర్యకు పాల్పడ్డారు. ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకుని నిర్బంధించారు.
ఒక చిన్న ఘటన.. పెద్ద తీర్పు. అమెరికా-కొలరాడో యూనివర్సిటీపై ఇద్దరు భారతీయ విద్యార్థులు న్యాయపరంగా గెలిచారు. క్యాంపస్లో భోజనాన్ని వేడి చేసుకున్నందుకు మొదలైన వివక్ష చివరకు కోటి 60లక్షల రూపాయల సెటిల్మెంట్తో ముగిసింది. భారతీయ ఆహారాన్ని అవమానించడంతో మొదలైన ఈ ఎపిసోడ్ చివరకు న్యాయస్థానంలో పోరాడి గెలిచింది. ఈ కేసులో గెలుపు డబ్బు గురించి కాదు.. భారతీయతను చిన్నచూపు చూస్తే ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగింది? పశ్చిమ దేశాల్లో…
దావోస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన కొనసాగుతోంది. ఇక ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగిస్తూ పుతిన్, జిన్పింగ్లను ప్రశంసించారు. వారిద్దరితో మంచి సంబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఏప్రిల్లో చైనాలో పర్యటించనున్నట్లు తెలిపారు.
గ్రీన్లాండ్ విషయంలో సహకరించకపోతే యూరోపియన్ దేశాలపై 200 శాతం సుంకం విధిస్తానని ఇటీవల ట్రంప్ బెదిరించారు. తాజాగా అధ్యక్షుడు మెత్తబడ్డారు. ఆ బెదిరింపును వెనక్కి తీసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
గత కొద్దిరోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్లో అల్లర్లు మొదలైన దగ్గర నుంచి ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. తామేమీ తక్కువ కాదంటూ ఇరాన్ కూడా ట్రంప్కు వార్నింగ్లు ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్ పర్యటన రద్దైనట్లుగా తెలుస్తోంది. దావోస్ వెళ్తుండగా ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది.
భారత్-పాకిస్థాన్ యుద్ధంపై మరోసారి ట్రంప్ క్రెడిట్ తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు తానే ఆపానంటూ చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా మరోసారి అదే విషయాన్ని ప్రస్తావించారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు గుడ్న్యూస్ చెప్పారు. గత కొంతకాలంగా ఈ దంపతులపై ఎన్నో పుకార్లు వచ్చాయి. కొద్దిరోజుల పాటు అంతర్జాతీయంగా వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా ఈ దంపతుల నుంచి మంచి శుభవార్త వచ్చింది.
ట్రంప్ హెచ్చరించినట్లుగానే గ్రీన్లాండ్లో ఉద్రిక్తతలు మొదలైనట్లుగా కనిపిస్తోంది. అమెరికా సైన్యం గ్రీన్లాండ్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పిటుఫిక్ స్పేస్ బేస్ నుంచి అమెరికా సైనిక చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.