Indian Students: భారతీయ విద్యార్థులకు షాక్.. సరైన పత్రాలు లేవంటూ తిరిగి పంపిన అమెరికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Students: అమెరికా వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలకున్న భారతీయ విద్యార్థులకు అమెరికా షాకిచ్చింది. అన్ని పనులు ముగించుకొని.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులను వారు వెళ్లాల్సిన విద్యాసంస్థలకు వెళ్లనివ్వకుండా ఆపేసి.. సరైన పత్రాలు లేవని చెబుతూ తిరిగి ఇండియాకు పంపించారు. అమెరికాకు వెళ్లిన 21 మంది భారత విద్యార్థులకు వీసా తనిఖీలు పూర్తయిన తరువాత సరైన పత్రాలు లేవనే కారణంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని స్వదేశానికి తిప్పి పంపారు. ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే జైలుకు పంపిస్తామని విద్యార్థులను హెచ్చరించినట్టు బాధిత విద్యార్థులు చెప్పారు. అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగోలోని విద్యార్థులను ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు పంపించారని తెలిపారు. వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు.
Read also: Alert: ఫోన్ కవర్‌లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త మొబైల్ పేలిపోవచ్చు
Also Read
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
- Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్‌గాంధీ విమర్శలు
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
విద్యార్థులు వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ, యూనివర్సిటీల నుండి అడ్మిషన్లు పొందినప్పటికీ.. చాలా మంది విద్యార్థులు ఇమ్మిగ్రేషన్ తనిఖీల తర్వాత వారిని వెనక్కి పంపించబడ్డారు. విద్యారు్థల దగ్గర సరైన పత్రాలు లేకపోవడంతోనే వారిని వెనక్కి పంపినట్టుగా అమెరికా ఇమ్రిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. విద్యార్థులకు సంబందించిన మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్స్ చూసిన తర్వాత వారిని తిప్పి పంపినట్టుగా చెబుతున్నారు. భారత్‌కు తిప్పి పంపిన 21 మంది విద్యార్థులు ఐదేళ్లపాటు పాటు అమెరికాలోకి రాకుండా వారిపై ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ.. తమను ఎందుకు తిప్పిపంపుతున్నారో అర్థం కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత విదేశాంగ శాఖ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఈ పరిణామాలతో భారత్ నుంచి అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థుల్లో సైతం ఆందోళన నెలకొంది. ఇండియాకు తిప్పిన పంపిన విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి సమస్యను పరిష్కరించేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?