Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆయన అసమర్థత వల్లే అమెరికా ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని విమర్శిస్తు్న్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఆరోపణలతో పలు కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్.
అక్రమ మార్గాల ద్వారా భారతీయులను అమెరియాలోకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అమెరికాన్ పోలీసులు పట్టుకున్నారు. భారత పౌరుడు సిమ్రంజిత్ సింగ్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
America: అమెరికాలోని అర్కాన్సాస్, ఇల్లినాయిస్లో టోర్నడో సృష్టించిన విధ్వంసం కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 21కి చేరింది. డజన్ల కొద్దీ గాయపడ్డారు. ఈ తుపాను కారణంగా పలు ఇళ్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.
హిందువులపై దాడుల్ని ఖండిస్తూ అమెరికాలోని జార్జియా అసెంబ్లీ తీర్మానం చేసింది. హిందూఫోబియాను ఖండిస్తూ చేసిన ఈ తీర్మానాన్ని ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న మొదటి అమెరికన్ రాష్ట్రంగా నిలిచింది.
Helicopters Crash: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు బ్లాక్ హాట్ హెలికాప్టర్లు కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్ సైనికులు మరణించారు. బుధవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. ఆర్మీ శిక్షణలో ఈ ప్రమాదం జరిగినట్లు మిలిటరీ అధికార ప్రతినిధి గురువారం తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్లు 101వ వైమానిక విభాగానికి చెందినవని, తొమ్మిది మంది సైనికులు మరణించారని దీని ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ ఆంథోనీ హోఫ్లర్ తెలిపారు.
యూఎస్ హౌస్ స్పీకర్ కెవిన్ మెక్కార్తీని కలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చైనా బెదిరించినప్పటికీ దౌత్యపరమైన ఒప్పందాల కోసం తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ న్యూయార్క్ చేరుకున్నారు.
రాహుల్ గాంధీ వ్యవహారం జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. రాహుల్ గాంధీ అనర్హత విషయంలో పరిణామాలను గమనిస్తున్నామని అమెరికా ప్రకటించగా.. తాజాగా జర్మనీ స్పందించింది.
కొన్నేళ్లగా భారతీయులు ప్రతి రంగంలోనూ తమ సత్తాను చాటుతున్నారు. ప్రపంచదేశాల్లో నాయకులుగా, సారథులుగా ఎదుగుతున్నారు. భారత సంతతికే చెందిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నారు. సుందర్ పిచాయ్.. గూగుల్, దాని మాతృసంస్థ అల్పాబెట్ సీఈఓగా ఉన్నారు.