అమెరికా, దక్షిణ కొరియా మధ్య జరుగుతున్న సైనిక విన్యాసాలకు ప్రతిగా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ద్వారా ఉత్తర కొరియా అమెరికాకు సవాల్ విసిరింది. ఉత్తర కొరియా వారం వ్యవధిలో మూడోసారి క్షిపణి పరీక్ష నిర్వహించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ దూసుకెళ్తోంది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం.. 2013-17 మరియు 2018-22 మధ్య ఆయుధాల దిగుమతిలో 11 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, భారతదేశం 2018 నుండి 2022 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా మొదటి స్థానంలో ఉండగా.. సౌదీ అరేబియా తర్వాతి స్థానంలో ఉంది.
డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం దివాళా తీసి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రభావం చాలా దేశాలపై పడుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూసివేత పట్ల స్టార్టప్ సంస్థలు ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ న్యాయవాది అరుణ్ సుబ్రమణియన్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తిగా అరుణ్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేశారు.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది దాటింది. అయినా ఆ యుద్ధం ముగిసే సూచనలు మాత్రం కనబడటం లేదు. ఈ క్రమంలోనే యుద్ధాన్ని ఓ "అదృశ్య హస్తం" నడిపిస్తోందని చైనా ఆరోపించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.