Tik Tok Ban: చైనీస్ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను నిషేధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే నెలలో సెనెట్‌లో ఓటింగ్ కు ప్రవేశ పెట్టనున్నట్లు విదేశీ వ్యవహారాల కమిటీ పేర్కొంది.
అగ్రరాజ్యమైన అమెరికాలో నల్లజాతీయులపై దాడులు ఆగడం లేదు. యూఎస్‌లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. మే 2020లో జార్జ్ ఫ్లాయిడ్ అనే యువకుడిని పోలీసులు చితకబాదడంతో అతను మరణించిన సంగతి తెలిసిందే.
AP Young Man Died in America: అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువకుడు కన్నుమూశాడు.. ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే రవికుమార్ అనే యువకుడు కన్నుమూయడంతో.. ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది… ఈ నెల 17న అమెరికా వెళ్లిన రవికుమార్.. మూడు రోజుల క్రితం సీమన్‌గా ఉద్యోగంలో చేరాడు.. అయితే, కంటెయినర్ పైనుంచి జారిపడి ప్రాణాలు విడిచాడు.. రవికుమార్ స్వస్థలం.. సంతబొమ్మాలి మండలం ఎం.సున్నాపల్లి.. రవికుమార్ మరణవార్తతో.. ఎం.సున్నాపల్లిలో విషాదచాయలు అలుముకున్నాయి.. అయితే, రవికుమార్…
అత్యాధునిక యుద్ధ ట్యాంకులు సరఫరా చేస్తామని అమెరికా, జర్మనీలు ప్రకటించిన నేపథ్యంలో రష్యా దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఉక్రెయిన్‌లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని చేసిన క్షిపణి దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందారు.
ఉత్తర సోమాలియాలో యూఎస్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) సీనియర్ వ్యక్తి బిలాల్-అల్-సుడానీని హతమార్చిందని యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ గురువారం ఒక ప్రకటనలో ధ్రువీకరించారు.
Pet Dog Shoots, Kills US Man Out On Hunting Trip: కుక్క తుపాకీని పేల్చుతుందని ఎవరైనా అనుకుంటారా..? కానీ ఇలా తుపాకీ కాల్పులకు ఓ కుక్క కారణం అయింది. తుపాకీని పేల్చి ఓ వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన అమెరికాలోని సెంట్రల్ రాష్ట్రం అయిన కాన్సాస్ లో జరిగింది. బాధిత వ్యక్తి అతని పెంపుడు జంతువు శనివారం సరదాగా వేటకు విహారయాత్రకు వెళ్లారు. ఈ సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది.
California shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజిల్స్ కాల్పుల ఘటనలో 11 మంది మరణించి 48 గంటలు లోపే మరో సంఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో రెండు కాల్పులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.…
Gun Fire : అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఉన్నత చదువుల కోసం చికాగో వెళ్లిన తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న కొప్పాల సాయి చరణ్ పై నల్ల జాతీయులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయి.
Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు.