ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ( శుక్రవారం ) ఉదయం 9.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి- అమలాపురం మండలం జనుపల్లి బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. అనంతరం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం లబ్దిదారులకు నిధులను విడుదల చేయనున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు.
Off The Record: అమలాపురం వైసీపీలో విభేదాలు నివురుగప్పిన నిప్పులా వున్నాయన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు….మినిస్టర్లు, ఎంపీల మధ్య కోల్డ్ వార్ ఎప్పుడైనా బద్దలవుతుందన్న డిస్కషన్ సాగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ మధ్య భగ్గుమంటున్న విభేదాలే. చింతా అనూరాధ పార్టీలో చేరిన తర్వాత…స్వగ్రామం మొగళ్ళమూరుకు ర్యాలీగా వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో… అనూరాధ ఫొటో పెద్దదిగా వేసి సీనియర్…
ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. దీంతో.. హుటాహుటిన మంత్రి విశ్వరూప్‌ను.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అనుచరులు.. ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్ష పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా…