Amalapuram: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్జిపై పోలీసుల దాడులు నిర్వహించారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు.
మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన కొమ్మాబత్తుల జతిన్ పుట్టినరోజు సందర్భంగా.. ఎనిమిది మంది యువకులు యానం వెళ్లారు.. ఆదివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.. అర్ధరాత్రి వరకు యానాంలో ఫుల్లుగా మద్యం సేవించి.. ఆ తర్వాత ఆటోలో సొంత ఊరికి బయల్దేరారు.. అయితే, రాత్రి 12.30 గంటల సమయంలో అమలాపురం మండలం భట్నవిల్లిలో లారీని ఢీకొట్టింది ఆటో.. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు వదిలారు.
అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అమలాపురానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మృతదేహాలు ఈ రోజు అమలాపురం హౌసింగ్ బోర్డులో ఉంటున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటికి చేర్చారు.. ఒక్కసారిగా ఆ మృతదేహాలను చూసి బోరున విలపించారు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే సతీష్ కన్నీరు మున్నీరుగా విలపించారు.. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ వెక్కి వెక్కి ఏడ్చారు.. ఆయన్ని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ఓదార్చారు..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు.
నేడు, రేపు అమలాపురంలో సామాజిక వర్గాల వారీగా భారీ ఎత్తున కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. నేడు కాపుల వన భోజన కార్యక్రమం ఉండగా.. రేపు శెట్టిబలిజ సామాజిక వర్గ వన భోజనాలు ఉన్నాయి.. అయితే, జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు..