ఆంధ్రప్రదేశ్ మంత్రి విశ్వరూప్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం అమలాపురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత అస్వస్థతకు గురైనట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. దీంతో.. హుటాహుటిన మంత్రి విశ్వరూప్‌ను.. రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అనుచరులు.. ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్ష పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? అనే విషయాలు తెలియాల్సి ఉంది..
Read Also: WhatsApp: వచ్చే నెల నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఓసారి చెక్ చేసుకోండి..!
కాగా, అమలాపురంలో ఉదయం నిర్వహించిన వైఎస్ వర్ధంతి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు మంత్రి విశ్వరూప్.. దివంగత నేత వైఎస్‌ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన ఆయన.. అనంతరం.. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన అస్వస్థతకు గురైనట్టు చెబుతున్నారు ఆయన అనుచరులు.