తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన కోనసీమ అల్లర్ల కేసు లో అమాయకులు బలి అవుతున్నారా? తమ ఫెయిల్యూర్ లని కప్పి పుచ్చుకోవడానికి పోలీసులు దొరికిన వాళ్ళ పై కేసులు పెడుతున్నారా? అసలు ఊళ్ళో లేని వారి పై కేసులు ఎలా పెడతారు? వాటి గురించి పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడిదే కోనసీమలో హాట్ టాపిక్ అవుతోంది. కోనసీమ జిల్లా కి అంబేద్కర్ పేరు పెట్టవద్దని ఈ నెల 20 న అమలాపురంలో భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.పోలీసులు కూడా…
జిల్లా పేరు మార్పు కోనసీమ జిల్లాలో విధ్వంసం సృష్టించింది… తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.. ఈ ఘటనపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది.. తప్పు మీదంటే.. మీదేనంటూ దూషించుకుంటున్నారు నేతలు.. అయితే, ఈ ఘటనపై ఎన్టీవీతో మాట్లాడిన హోం మంత్రి తానేటి వనిత.. అసలు కోనసీమ విధ్వంసం ఊహించ లేదు, హఠాత్తుగా జరిగిందని పేర్కొన్నారు. అంబేద్కర్ పేరు పెట్టకపోతే జనసేన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది వాస్తవం కాదా? అని ప్రశ్నించిన ఆమె.. ధర్నాలు, నిరాహార…
జిల్లా పేరు మార్పు వ్యవహారంలో కోనసీమ జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. జిల్లా కేంద్రమైన అమలాపురం అట్టుడికిపోయింది.. విధ్వంసానికి దారితీసింది.. అయితే, ఈ ఘటనపై ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతూనే ఉన్నా.. ప్రస్తుతం మాత్రం అమలాపురంలో ప్రశాంత వాతావరణం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. అయితే, కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.. సెక్షన్ 144, పోలీసు యాక్ట్ 30 అమలులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. Read Also:…
కోనసీమ జిల్లా పేరు మార్పును నిరసిస్తూ మంగళవారం అమలాపురంలో ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే బుధవారం కూడా కోనసీమ ప్రాంతంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లీ ఆందోళనలు ప్రారంభం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఛలో రావులపాలెంకు కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో బుధవారం ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న రావులపాలెంలో కొద్దిసేపటి క్రితమే ఆందోళనలు మొదలయ్యాయి. Minister Roja: అమలాపురం అల్లర్లకు…
అమలాపురంలో అల్లర్లు జరిగిన విధానంపై పలు పార్టీల స్పందన చూస్తుంటే వాళ్లే కథంతా నడిపించారని అనుమానం కలుగుతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమలాపురంలో దాడులకు కారణం వైసీపీ అని టీడీపీ, జనసేన పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆ పార్టీలవి దుర్మార్గపు రాజకీయాలని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మంత్రి, తమ ఎమ్మెల్యే ఇళ్లపై తామే దాడులు చేయించుకుంటామా అని సజ్జల ప్రశ్నించారు. ఈ దాడులు కుట్రపూరితంగా పథకం ప్రకారమే జరిగాయని సజ్జల స్పష్టం…
కోనసీమ జిల్లా పేరు మార్పుతో రగడ జరుగుతోంది. దీంతో అమలాపురం అట్టుడుకుతోంది. అయితే అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వ్యక్తి అన్యం సాయి అని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అన్యం సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతడు గతంలో కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులు వివరిస్తున్నారు. అయితే అన్యం సాయి వైసీపీకి చెందిన వ్యక్తి అంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. అతడు గతంలో ప్రభుత్వ ముఖ్య…
జిల్లాల విభజన.. నామకరణ నేపథ్యంలో కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్ని జిల్లాలకు గతంలోనే పేర్లు పెట్టిన ప్రభుత్వం.. కోనసీమ జిల్లాకు పేరెందుకు పెట్టలేదు..?అన్ని జిల్లాలతో పాటు అదే రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ గొడవే ఉండేది కాదు.జిల్లాలకు మహనీయు పేర్లు పెట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమే. జిల్లాలకు పేర్లు పెట్టడం అనేది కడపకు వైఎస్ పేరు పెట్టినప్పట్నుంచి…
అమలాపురంలో జరిగిన విధ్వంసం వెనుక కచ్చితంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, వాళ్ల నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అమలాపురం ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆందోళనలు, విధ్వంసంలో కొన్ని రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నట్లు ఉంది.. జరిగిన సంఘటన తీరు, ప్రతిపక్ష నాయకుల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయన్నారు.. అందుకే ప్రభుత్వ వైఫల్యం అంటున్నారని మండిపడ్డ ఆయన.. పోలీసులు సంయమనం…
కోనసీమ జిల్లాకి అ౦బేద్కర్ పేరు పెట్టడానికి అన్ని పార్టీలు అ౦గీకరి౦చాయని ప్రభుత్వం మాకు ఏమైనా లేఖ ఇచ్చి౦దా..? అని ప్రశ్నించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అమలాపురంలో ప్రభుత్వం ఓ చర్చకి తెరలేపి౦ది.. ప్రభుత్వానికి మారణ హోమం జరగడం కావాలని ఆరోపించారు. అమలాపురంలో వాళ్లే అంతా చేశారన్నా ఆశ్చర్య పోనక్కరలేదన్న ఆయన.. గతంలో ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో చేశారని మండిపడ్డారు.. కోనసీమలో జరిగిన ఘటనకు ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్న బీజేపీ…