Ramachandrapuram Bandh: నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపు ఇచ్చింది జేఏసీ.. రామచంద్రాపురం నియోజకవర్గాన్ని ప్రస్తుతం ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వద్దు.. మా ప్రాంతాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ నేడు రామచంద్రాపురం బంద్‌కు పిలుపునిచ్చింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు ప్రజల డిమాండ్‌ను పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని జేఏసీ నాయకులు మండిపడుతున్నారు.. రామచంద్రాపురం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం నుండి…
మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీలో నూతన నియామకాలు చేపట్టింది. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే శ్రీకాంత్ ను నియమించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా షేక్ ఆసిఫ్, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రకటించింది. అలాగే.. వైసీపీలో పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ పూర్తి స్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను పీఏసీ మెంబర్లుగా నియమించారు.
అమలాపురంలోని వెంకటరమణ థియేటర్‌లో "కోర్ట్" సినిమా టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషయంపై అందిన సమాచారం ఆధారంగా, రీజనల్ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కె. మాధవి, మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో) అశోక్ నేతృత్వంలో అధికారుల బృందం థియేటర్‌లో తనిఖీలు నిర్వహించింది. ఇక ఈ తనిఖీల సందర్భంగా, "కోర్ట్" సినిమా టికెట్ ధర నిబంధనల ప్రకారం 110 రూపాయలుగా ఉండాల్సి ఉండగా, థియేటర్ యాజమాన్యం దానిని 150 రూపాయలకు…
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ నుంచి వెళ్తూ కార్యకర్త హఠాన్మరణం చెందారు. అమలాపురం నియోజకవర్గం ఈదరపల్లికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త అడపా దుర్గాప్రసాద్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి తిరిగి వెళ్తూ హఠాన్మరణం చెందినట్లు పార్టీ పేర్కొంది. ఈ ఘటన ఎలా జరిగింది అనే అంశంపై క్లారిటీ లేదు. కాగా.. ఈ ఘటనపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ విషయం తనకు తెలిసి చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన…
సోషల్ మీడియా మోజులోపడి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యేందుకు పిచ్చి పిచ్చిగా రీల్స్ చేస్తు తమ పైత్యాన్ని చాటుకుంటున్నారు. ఇన్ స్టాలో లైకుల కోసం, వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో ఓ యూట్యూబర్ మనీ హంట్ పేరుతో రీల్స్ చేసి హల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన పోలీసులు ఆ యూట్యూబర్ తిక్కకుదిర్చి అరెస్ట్ చేశారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో…
Gas Cylinder Blast: రాష్ట్రంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 8 మందికి గాయాలయ్యాయి. ఇక ఘటనలో క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు అధికారులు. అమలాపురం పట్టణం రావులచెరువులోని బాణసంచా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకోగా.. బాణాసంచా పేలుడు దాటికి రెండు అంతస్తుల భవనం ధ్వంసమైంది. ఇకపోతే అమలాపురం భారీ పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన…
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర ప్రమాదం జరిగింది.. రావులచెరువులో ఓ ఇంట్లో బాణా సంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవిచింది.. అప్పటికే నిల్వ చేసిన బాణాసంచా ఓవైపు.. తయారీ చేస్తున్న టపాసులు మరోవైపు ఉండడంతో.. జరిగిన ఈ ప్రమాదంలో పెట్ట నష్టం జరిగింది.. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
మేం ఎక్కువగా అప్పులు చేశాం.. తీర్చలేక వెళ్ళిపోతున్నాం.. మా కోసం వెతక వద్దు అంటూ.. దంపతులు అదృశ్యమయ్యారు.. గోదావరి నదిలో దూకి చనిపోతున్నాం అని సూసైడ్ లెటర్ రాసి మరి భార్యా భర్తలు అదృశ్యమయ్యారు... పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.. వాళ్లకు మేం ఊరు వెళ్ళామని చెప్పండి.. లేకపోతే వాళ్లు ఏడుస్తారు అంటూ ఆ లెటర్ లో రాశారు ఆ దంపతులు.