కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడంతో అమలాపురం అట్టడుకుతోంది. ఈ అంశంపై పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసనలకు దిగడంతో ఎస్పీ ఆధ్వర్యంలో అమలాపురం చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తుండటంతో నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈక్రమంలోనే మొత్తం ఐదు బస్సులు, పోలీసు వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. తర్వాత నిరసనకారులు మంత్రి విశ్వరూప్ ఇంటిని, ఆవరణలో ఉన్న కార్లను తగులబెట్టారు. దీంతో అమలాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఆందోళనకారులు తన…
కోనసీమ జిల్లా మార్పు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. కోనసీమ జిల్లా పేరును ప్రభుత్వం ఇటీవల డా.బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడం కొంతమందికి ఆగ్రహాన్ని తెప్పించింది. అయితే కోనసీమ జిల్లాగానే పేరును కొనసాగించాలని మళ్లీ డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో అమలాపురంలో హైటెన్షన్ నెలకొంది. జిల్లా పేరు మార్పుపై జరిగే ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు 144 సెక్షన్ విధించినా లాభం లేకపోయింది. Undavalli: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు.. పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు..! పోలీసులు ఎటువంటి సమావేశాలు,…
అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ యువత ర్యాలీకి దిగింది. అనుమతి లేని కారణంగా అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వారు నిరసనకారులు. డిఎస్పీ మాధవరెడ్డి, ఎస్పీ గన్ మ్యాన్ కు గాయాలయ్యాయి. దీంతో లాఠీఛార్జ్ తో చెదరగొట్టారు పోలీసులు. కలెక్టరేట్ ముట్టడికి కోనసీమ జిల్లా మద్దతు దారుల రెడీ అయ్యారు. జై కోనసీమ నినాదాలతో కలెక్టరేట్ వైపు వెళ్తున్న యువతతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. అక్కడేం జరుగుతుందో…
కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి కుడుపూడి చిట్టాబ్బాయి వర్థంతి సభలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం వాడీవాడీగా ఉంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అధికారపార్టీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చుని కృతజ్ఞతలు తెలియజేయడం మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన కొందరికి రుచించలేదు. వైసీపీలోనే ఉన్న ఆ…
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైసిపి సంక్షోభంలో పడింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసిపిలో ప్రాధాన్యత ఇవ్వడం, నియోజకవర్గ వైసిపి శ్రేణులకు మింగుడు పడటంలేదు. వైసిపికి రాజోలు నియోజకవర్గంలో కో – ఆర్డినేటర్ గా పెదపాటి అమ్మాజీ, మాజీ కో – ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు లను ప్రక్కన పెట్టి ఎమ్మెల్యే రాపాకకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు డీలా పడ్డారు. ఇటీవల అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా…
దళితులకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని అమలాపురం మాజీ ఎంపీ జి.వి హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రేమ వివాహాల కేసుల్లో దళితులకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. జగన్ చెల్లెలు కులాంతర వివాహాం చేసుకున్న ఫర్వాలేదు. కానీ ఇతరులు చేసుకుంటే కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. కులాంతర వివాహాలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం నిలిపివేసిందని హర్షకుమార్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో ప్రభుత్వం నాన్చుడి…
తూర్పుగోదావరి : కోనసీమలో కరోనా కలకలం రేపుతోంది.. విధి నిర్వహణలో ఉన్న పోలీసుల పై కరోనా పంజా విసురుతోంది. ఈ నేపథ్యంలోనే అమలాపురం డివిజన్ పరిధిలో ఏకంగా 10 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో ఒక సిఐ, ఐదుగురు ఎస్ ఐ లకు నలుగురు కానిస్టేబుల్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కోనసీమలో దసరా ఉత్సవాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల ఆందోళనల బందోబస్తులో పాల్గొన్న పోలీసులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.. కరోనా…