అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ చీప్ చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయని ఆయన కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్రంలో ఆధార్ కార్డు, ఇల్లు ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. రాజకీయాలు చేసేది ఉండేది పక్కరాష్ట్రంలో విషం కక్కేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల ప్రజలపైనా అని ఆయన విమర్శించారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు దమ్ము, ఖలేజా ఉంటే సింగిలాగానే పోటీ చేయాలి అని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు. ఎన్నికలకు కుక్కలు, నక్కలు, పందులు కలిసి వస్తాయి.. కానీ సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ సినిమా డైలాగ్ ను ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో అమలాపురంలోనే కాదు కోనసీమ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గలలో వైసీపీ జెండా ఎగరవేస్తామని మంత్రి జోగి రమేష్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి మరోసారి వైసీపీ పార్టీ సత్తా చాటి.. సీఎం జగన్ ను సీఎం చేసుకుంటామని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. కొందరు చేస్తున్న విష ప్రచారం వల్ల తాము భయపడే ప్రసక్తి లేదని ఆయన వెల్లడించారు.