Priyanka Jain: తిరుమల శ్రీవారి భక్తులకు, టీటీడీకి క్షమాపణలు చెప్తూ బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ శివ్ కుమార్ వీడియో విడుదల చేశారు. సరదా కోసం చేసిన వీడియో ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఊహించలేదు.
తిరుమల లడ్డు తయారీలో కల్తీ అంశంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు ఆ దీక్ష విరమించేందుకు తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు పవన్. పవన్ వెంట ఆయన సన్నిహితుడు, సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ఇక తిరుమలకు పవన్ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు…
గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు.
తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని అఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి.
తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో మూడు రోజుల తర్వాత సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తుంది టీటీడీ. మరోవైపు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని రేపు ,ఎల్లుండి సర్వదర్శనం టోకెన్ జారీని తాత్కాలికంగా నిలిపివేసింది టీటీడీ. 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు 12వ తేదీ ఉదయం నుంచి జారీ చేయనున్నారు. తిరుమలకు పూర్వ వైభవం వస్తోంది. కలియుగ వైకుంఠనాథుడిని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు పెద్ద సంఖ్యలో…
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు భారీ ఎత్తున ఉద్యమం చేపట్టారు. వారు చేపట్టిన మహాపాదయాత్ర అలిపిరి శ్రీవారి పాదాల వద్జ ముగిసింది. కొబ్బరికాయలు కొట్టి అలిపిరి వద్ద యాత్ర ముగించారు అమరావతి రైతులు. అమరావతినే శాశ్వత రాజధానిగా కొనసాగించాలని కొబ్బరి కాయలు కాట్టి శ్రీవారిని వేడుకున్నారు. నవంబర్ 1న తుళ్లూరు నుంచి న్యాయస్థానం- దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర 45వ రోజల పాటు సాగింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో…
ఏడుకొండలు ఎక్కాలంటే వాళ్ళ ప్రాపకం వుండాల్సిందేనా ? కోవిడ్ నిబంధనల పేరుతో తిరుమలలో ఆంక్షలు పెరిగిపోతున్నాయా? ఆపద మొక్కులవాడిని అలిపిరి వద్దే వేడుకుని వెనుతిరగాలా? దర్శనం కావాలంటే శ్రీవారి అనుగ్రహం ఒక్కటి సరిపోదా? ఆపదమొక్కులవాడు. కోరిన వారి కోర్కెలు ఇట్టే తీర్చే దేవుడిగా పేరొందిన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తుంటారు. స్వామి వారి దర్శనార్దం అలిపిరి వద్దకు చేరుకున్న భక్తులకు ఎలాంటి ఆంక్షలు వుండవు. టిటిడి చెబుతున్నట్లు సప్తగిరులు పవిత్రమైనవే. అడుగడుగునా…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఎక్కువ మంది భక్తులు అలిపిరి కాలిమార్గం ద్వారా కొండకు చేరుకుంటూ ఉంటారు. అయితే, కరోనా లాక్‌డౌన్ సమయంలో మే నెలలో అలిపిరి నడక మార్గాన్ని మూసేసి మరమ్మత్తులు చేయాలని సంకల్పించింది. Read: కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ ! రెండు నెలల్లో నడక మార్గంలో మరమ్మత్తులు పూర్తి చేయాలని అనుకున్నా, ఆ…
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్నది. ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తిరుపతిలోనే ఉంది పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి. నారా లోకేష్ విన్నూతంగా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా అలిపిరిలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలిపిరిలో నారా లోకేష్ ప్రమాణం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ప్రమాణం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ… తమ…