తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతున్నది. ఉప ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు దూసుకుపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం తిరుపతిలోనే ఉంది పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం నిర్వహిస్తున్నాయి. నారా లోకేష్ విన్నూతంగా ప్రచారం చేస్తున్నాడు. తాజాగా అలిపిరిలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలిపిరిలో నారా లోకేష్ ప్రమాణం చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ ప్రమాణం చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ… తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తాను ప్రమాణం చేశానని, జగన్ కూడా తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేస్తాడా అని ప్రశ్నించారు. తన సవాల్ ను స్వీకరించి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేయాలని నారా లోకేష్ అన్నారు. ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని జగన్ గతంలో కోరాడని, ఎన్నికలు పూర్తయ్యి జగన్ సీఎం అయ్యాక ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని, సీబీఐకి ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. తన చెల్లికి న్యాయం చేయలేని జగన్, రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించారు.