Tirupati: వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భారీగా తరలిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు. గరుడవాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. నాలుగు మాడవీధులలో విహరించిన స్వామివారిని చూసి భక్తులు పరవశించారు. గరుడసేవ సందర్భంగా.. ఏనుగులు, గుర్రాలు, నృత్య బృందాలు, కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలు ఊరేగింపును మరింతగా ఆకట్టుకున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు.
READ MORE: విమాన ప్రమాదాల్లో మరణించిన దేశాధినేతలు వీరే..!
Also Read
మరోవైపు గోవిందరాజస్వామి గరుడసేవను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి కానుకగా రూ.10 లక్షల విలువైన ఆభరణాలు సమర్పించారు. తన సోదరుడు అయిన గోవిందరాజునికి తిరుమల శ్రీవారు పది లక్షలు విలువచేసే.. మూడు ఆభరణాలు, వజ్రపు పోగులు, లక్ష్మి కాసు మాల, తెల్ల రాళ్ల పతకాన్ని బహుకరించినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయంలో మే 22న నృసింహ జయంతి నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రతి ఏటా వైశాఖ మాసం స్వాతి నక్షత్రంలో నృసింహ జయంతిని నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ యోగ నరసింహస్వామి మూలమూర్తికి ప్రత్యేక అభిషేకం చేస్తారు. అనంతరం వసంత మండపంలో శ్రీ నరసింహస్వామి పూజ నిర్వహిస్తారు. మే 23వ తేదీ వైశాఖ పౌర్ణమి గరుడసేవను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వదర్శనానికి దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల టైం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం చాలా కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు.
తాజావార్తలు
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!