కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఎక్కువ మంది భక్తులు అలిపిరి కాలిమార్గం ద్వారా కొండకు చేరుకుంటూ ఉంటారు. అయితే, కరోనా లాక్‌డౌన్ సమయంలో మే నెలలో అలిపిరి నడక మార్గాన్ని మూసేసి మరమ్మత్తులు చేయాలని సంకల్పించింది.
Read: కోడి రామకృష్ణ కూతురు టాలీవుడ్ ఎంట్రీ !
రెండు నెలల్లో నడక మార్గంలో మరమ్మత్తులు పూర్తి చేయాలని అనుకున్నా, ఆ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో మరో రెండు నెలలపాటు అలిపిరి మార్గాన్ని మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లోగా అలిపిరి మరమ్మత్తులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. కాలినడకన తిరుమలకు చేరుకోవాలి అనుకునే భక్తులు శ్రీవారి మెట్లమార్గాన్ని వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు తెలియజేశారు.