బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. ఇతని సినిమాలకు ఫ్లాప్ టాక్ వచ్చినా సరే, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది. పైగా, అతి తక్కువ సమయంలోనే షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఏకకాలంలోనే రెండు, మూడు సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటాడు. ఇతనికున్న ఈ కమిట్మెంట్ & బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ చూసే.. దర్శకనిర్మాతలు అక్షయ్‌తో సినిమాలు చేసేందుకు క్యూ కడుతుంటారు. చివరికి.. ఇతర హీరోలకు వెళ్ళాల్సిన ప్రాజెక్టులు కూడా ఇతనికి చేరుతాయి.…
‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్ నిజంగానే ఆ పేరు సార్థకం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. సినిమాల సక్సెస్, వాటి కలెక్షన్స్ ను కూడా ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడంది. పైగా విషపూరిత ప్రచారాలకు సోషల్ మీడియా వేదికగా మారి చాలా రోజులయింది. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాను నటించిన మూడు రీమేక్ మూవీస్ ను నేరుగా ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకోవడం…
సినీ పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరకొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈనెల 17 నుంచి 28 వరకు 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతో ఘనంగా జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపై ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు సందడి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే సెలబ్రిటీలలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే తాజాగా ఆయన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా…
అభిమానం ఉండాలే కానీ, ఎవరినైనా ఎప్పుడైనా ఇట్టే అభినందించవచ్చు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడంటూ అజయ్ దేవగన్ తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా అభినందించారు. అక్షయ్ కుమార్ 30 ఏళ్ళుగా సినిమా రంగంలో ఉన్నందుకు, ఇంకెన్నో ఏళ్ళు ఉండాలనీ కోరుకుంటూ అజయ్ అభినందన సాగింది. ఇంతకూ ఈ రోజున అక్షయ్ ని అజయ్ ఎందుకు గుర్తు చేసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే, అక్షయ్ జీవితంలో మే 5వ తేదీ ప్రాముఖ్యం ఏమిటో…
ప్రియదర్శన్ రూపొందించిన ‘భూల్ భులయ్యా’ చిత్రం 2007లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి హారర్ కామెడీ చిత్రంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, షైనీ అహూజా కీలక పాత్రలు పోషించారు. మళ్లీ ఇంతకాలానికి అదే పేరుతో ‘భూల్ భులయ్యా -2’ మూవీ వస్తోంది. తొలి చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజ్ పాల్ యాదవ్ ఈ సినిమాలోనూ నటించాడు. అతనితో పాటు ఇప్పుడీ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు కీ-రోల్స్ చేశారు. ‘నో…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘సూరారై పొట్రు’. ఈ సినిమా తెలుగులోనూ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ అయ్యింది. కరోనా కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య ఈ చిత్రాన్ని దర్శకురాలు సుధ కొంగర తోనే హిందీలోనూ రీమేక్ చేస్తున్నట్టు సూర్య ప్రకటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హిందీలో మొదలైంది. తమిళంలో సూర్య పోషించిన ఎయిర్ డెక్కన్ అధినేత…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇటీవల చేసిన ఒక పాన్ మసాలా యాడ్ పై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ ఎఫెక్ట్ తో ఆ యాడ్ కంపెనీ ఇలాచీ బ్రాండ్ అంబాసిడర్‌గా వైదొలిగి, తాజాగా ఆ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ లో అక్షయ్ ప్రకటించారు. ఈ ట్వీట్ లో అక్షయ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినందుకు తన అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఈ యాడ్ కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. షారుఖ్, అజయ్ లతో కలిసి ఇలాంటి యాడ్ చేస్తావా ? అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేనా ఆయన అంతకుముందు అలాంటి యాడ్స్ పై కామెంట్స్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ… చెప్పింది చేయనప్పుడు ఇలా నీతులు చెప్పడం దేనికి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ యాడ్ ఏమిటంటే… బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ నుంచి షారుఖ్, అజయ్ దేవగణ్ వంటి…
అటు యాక్షన్ తోనూ, ఇటు కామెడీతోనూ కబడ్డీ ఆడేస్తూ మురిపిస్తున్నాడు స్టార్ హీరో అక్షయ్ కుమార్. మళయాళ దర్శకుడు ప్రియదర్శన్, అక్షయ్ తో తీసిన చిత్రాలతోనే బాలీవుడ్ భలేగా మ్యాజిక్ చేశాడు. వీరి కాంబోలో వచ్చిన తొలి సినిమా ‘హేరా ఫేరీ’ కితకితలు పెడుతూనే కాసులు రాల్చుకుంది. తరువాత వచ్చిన వీరి సినిమాల్లో ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భాగమ్ భాగ్’ సూపర్ హిట్, ‘గరమ్ మసాలా’ సూపర్ హిట్, ‘భూల్ భులయ్యా’ హిట్, ‘దే ధనా…
బాలీవుడ్ స్టార్ హీరోలంతా సౌదీ బాట పట్టడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ ఆదివారం సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బదర్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ను కలిశారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియా సాంస్కృతిక శాఖ మంత్రి బాదర్ బిన్ ఫర్హాన్ అల్సౌద్……