కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘సూరారై పొట్రు’. ఈ సినిమా తెలుగులోనూ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ అయ్యింది. కరోనా కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య ఈ చిత్రాన్ని దర్శకురాలు సుధ కొంగర తోనే హిందీలోనూ రీమేక్ చేస్తున్నట్టు సూర్య ప్రకటించారు.

తాజాగా ఈ సినిమా షూటింగ్ హిందీలో మొదలైంది. తమిళంలో సూర్య పోషించిన ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీనాథ్ పాత్రను హిందీలో అక్షయ్ కుమార్ చేస్తున్నారు. రాధిక మదన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సూర్య కు చెందిన 2డీ సంస్థ హిందీలో విక్రమ్ మల్హోత్రాతో కలిసి నిర్మిస్తోంది. దీనికి సంబంధించి చిన్న పాటి వీడియోను అక్షయ్ కుమార్ పోస్ట్ చేశారు. విశేషం ఏమంటే… దర్శకురాలు సుధా కొంగరతో ‘కేజీఎఫ్’ చిత్ర నిర్మాతలు సినిమాను నిర్మించబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు.
With the auspicious coconut-breaking and a small prayer in our heart, we begin the filming of our yet untitled film which is about dreams and the power of it 💫 In case you’ll have any title suggestions, do share and of course your best wishes 🙏🏻 pic.twitter.com/nSUmWXbWlK
— Jolly Mishra – Asli Jolly from Kanpur (@akshaykumar) April 25, 2022