Akshay Kumar: బన్నీతో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత చిత్రసీమలో కొంతకాలం నుంచి సౌత్ vs నార్త్ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే! ముఖ్యంగా.. జాన్ అబ్రహం బాలీవుడ్ ఎప్పటికీ నం. 1 అని చేసిన వ్యాఖ్యలు, ఈ వార్‌కి బీజం పోసింది. అప్పట్నుంచి సెలెబ్రిటీలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అక్షయ్ కుమార్ మాత్రం చిత్ర పరిశ్రమలన్నీ ఒక్కటేనన్న నినాదానికి తెరలేపాడు. ప్రస్తుతం తన పృథ్వీరాజ్ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న ఈ స్టార్ హీరో.. బాలీవుడ్ & సౌత్ అంటూ లేవని, దయచేసి సౌత్ vs నార్త్ పోరుని సృష్టించొద్దని కోరాడు. మనమంతా భారతీయులమని, ఇండియన్ సినిమా అనే ఇండస్ట్రీ ఒక్కటే ఉందని అక్షయ్ చెప్పుకొచ్చాడు.
ఇక ఇదే సమయంలో పుష్ప సినిమా బాలీవుడ్‌పై చేసిన దండయాత్ర గురించి మాట్లాడుతూ.. మన ఇండస్ట్రీకి ఆ సినిమా రూపంలో ఓ పెద్ద విజయం దక్కిందన్నాడు. అలాగే.. బన్నీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. మంచి కథతో ఓ దర్శకుడు ముందుకొస్తే.. బన్నీతో కలిసి సినిమా చేస్తానన్నాడు. కేవలం బన్నీతోనే కాదు.. సినీ ప్రియుల్ని అలరించడం కోసం తాను ఏ సౌత్ స్టార్ హీరోతోనైనా సినిమా చేసేందుకు రెడీ అన్నాడు.
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
ఈమధ్య సౌత్ సినిమాలు జాతీయంగా సత్తా చాటుతున్న తరుణంలో.. బాలీవుడ్ బడా హీరోలందరూ దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే! మరి, తానూ నటించేందుకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు కాబట్టి, అక్షయ్ కోసం మన ఫిల్మ్ మేకర్స్ ఏదైనా కథ సిద్ధం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..