కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగుల్చుతున్న విషయం తెలిసిందే. అయితే.. నేడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆందోళన కారుల నిరసనతో రణరంగంగా మారింది. ఈ ఘటనపై కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడికి వేలమంది తరలి వస్తుంటే నిఘా వ్యవస్థ కూడా ఫామ్ హాజ్ లో పాడుకుందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకురాలు ఎస్సై కాలర్ పట్టుకుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టఆర్‌ఎస్, కాంగ్రెస్ వచ్చే ఎన్నికలో కలిసి పోటీ చేయడానికే నిన్నటి రాజ్ భవన్ ముట్టడి డ్రామా అని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర డీజీపీ వెంటనే రాజీనామా చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మంత్రుల మీద మాలాంటి ఎమ్మెల్యేల మీద దాడులు చేస్తే నిఘా వ్యవస్థ ఏటు పోతది.. సైన్యంలో చేరాలనుకొనే యువకులు అల్లర్లకు పాల్పడరు.. ప్రభుత్వం గుండాలను పంపి అల్లర్లను ప్రోత్సహిస్తోంది అని ఆయన ఆరోపించారు. అగ్నిపథ్ మీద చేర్చకు ట్విట్టర్ మంత్రి సిద్దమా అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ లో హింసాత్మాక ఘటనలు ప్రొత్సహిస్తే మీ అకౌంట్ బ్లాక్ చేయాల్సి వస్తది అంటూ ఆయన ఘాటుగా స్పందించారు.