Agnipath: నిర్ణయం తీసుకునే ముందు మా వాదన వినండి.. సుప్రీంలో కేంద్రం కేవియట్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముందు తమ వాదన వినాలని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం విన్నవించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర సర్కారు కేవియట్ దాఖలు చేసింది. అగ్నిపథ్‌పై ఇప్పటివరకు మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది హరీశ్ అజయ్ సింగ్ సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఎంఎల్ శర్మ అనే న్యాయవాది అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో పిల్ దాఖలు చేసి పలు అంశాలను ప్రస్తావించారు. అగ్నిపథ్ పథకం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ.. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ సోమవారం పిల్ దాఖలు చేశారు. వందల ఏళ్ల నాటి నుంచి విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు.
Also Read
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక నిరసనపై విచారణ జరిపేందుకు.. రైల్వేలతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టంపై దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేయాలని విశాల్ తివారీ అనే మరో న్యాయవాది మరో పిల్ దాఖలు చేశారు. అగ్నిపథ్ పథకం, జాతీయ భద్రత, భారత సైన్యంపై దాని ప్రభావాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..