Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Iaf Receives Over 1 83 Lakhs Applications Under Agnipath Scheme In Six Days

Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. గడువు మరో 6 రోజులే!

NTV Telugu Twitter
Published Date :June 29, 2022 , 8:19 pm
By Mahesh Jakki
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. గడువు మరో 6 రోజులే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘అగ్నిపథ్’ పథకానికి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది. త్రివిధ దళాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం జూన్ 24న రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ఆరురోజుల వ్యవధిలోనే లక్షా 83వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తెచ్చిన కొత్త పథకానికి మంచి ఆదరణ కనిపిస్తోందని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జులై 5న ముగుస్తుందని.. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉంటే, త్రివిధ దళాల నియామకాల్లో సంస్కరణలు తీసుకువచ్చేందుకుగాను ‘అగ్నిపథ్’ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం జూన్ ​14న ప్రకటించింది. పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల గల యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నాలుగేళ్లు పూర్తయ్యాక వారిలో 25 శాతం మంది అగ్నివీరులను కొనసాగిస్తామని పేర్కొంది. గత రెండేళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో ఈ ఏడాది (2022) రిక్రూట్​మెంట్‌లో గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది. దీంతో దరఖాస్తులు భారీగా వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకంపై దేశవ్యాప్తంగా యువత నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పలు రాష్ట్రాల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగానూ మారాయి. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న పంజాబ్‌ వంటి రాష్ట్రాలు కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసే యోచనలోనూ ఉన్నాయి. దీనికి దరఖాస్తుల గడువు వచ్చే నెల 5న ముగియనుంది. అంటే మరో ఆరు రోజులు మాత్రమే గడువు ఉందని అధికారులు చెప్పారు. ఈ ఆరు రోజుల్లో అప్లికేషన్ల సంఖ్య భారీగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Viral Video: గంగానదిలో దూకిన 70 ఏళ్ల ముసలామె.. ఆశ్చర్యంలో నెటిజన్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • agnipath
  • agnipath applications
  • Agnipath Protests
  • agnipath scheme
  • Airforce

తాజావార్తలు

  • Off The Record: ఆ సమస్యను వైసీపీ లీడర్స్‌ ఎందుకంత లైట్‌ తీసుకున్నారు..?

  • Anchor Swecha: యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య వేళ.. పూర్ణచందర్ సంచలన లేఖ

  • Off The Record: పిఠాపురంలో వైసీపీ నేతలు సైలెంట్ గా సైడవుతున్నారా..?

  • Revanth Reddy : ఎన్ కన్వెన్షన్ ను కూల్చినా నాగార్జున చెరువు కోసం రెండెకరాలు ఇచ్చాడు

  • Health Tips: ఈ ఫుడ్స్ వండేందుకు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions