ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం సిక్కులను, హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడి చేశారు. కాబూల్ లోని బాగ్-ఇ బాలా ప్రాంతంలో గురుద్వారా కార్తే పర్వాన్ లక్ష్యంగా ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఈ దాడిలో ఒక సిక్కుతో పాటు ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గుర్ని అక్కడి భద్రతాబలగాలు హతమార్చాయి. గురుద్వారాలో శనివారం ఉదయం 30 మంది వరకు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్స్ తో విరుచుకుపడ్డారు. గ్రెనెడ్ విసరడంతో గురుద్వారాలో మంటలు చెరేగాయి.…
ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం…
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఆఫ్ఘన్ లో ప్రజా ప్రభుత్వ ఉన్న సమయంలో స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించే వారు. అయితే తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత కేవలం వంటిళ్లకే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా.. భర్త లేదా బంధువులు తోడుంటేనే అనుమతి.. కాదని రూల్స్ ఉల్లంఘిస్తే కొరడా దెబ్బలతో శిక్షించడం ఇది తాలిబన్ల రాక్షస పాలన. తాజాగా తాలిబన్ పాలనలో ఓ ఆఫ్ఘన్ జర్నలిస్టు పరిస్థితి…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్…
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు. ఇదిలా…
తాలిబన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి.. నియంత పాలన.. కఠిన నిబంధనలు.. అయితే గత కొన్ని నెలల క్రితం అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్‌ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ మహిళలు బయటకు రాకుండా హుకుంలు జారీ చేశారు. అంతేకాకుండా మహిళల స్వేచ్చపై ఉక్కుపాదం మోపారు. మొదట్లో మహిళలకు స్వేచ్చనిస్తామని ప్రకటించిన తాలిబన్ల అమలు చేయలేదు. దీంతో తాలిబన్ల తీరుపై ప్రపంచ దేశాలు పెదవి విరవడంతో.. ఇప్పుడు మళ్లీ తాలిబన్లలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. మహిళలకు త్వరలోనే ‘గుడ్‌న్యూస్’…
ఆఫ్ఘనిస్తాన్ దుర్భర పరిస్థితులను అనుభవిస్తోంది. తాలిబాన్ పాలనలో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. గతేడాది ఆగస్టు 15న ప్రధాని ఆష్రఫ్ ఘనీ పౌరప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు వారి పాలనను తీసుకువచ్చారు. అమెరికా సైన్యం ఆఫ్ఘన్ ను వదిలిన తర్వాత అక్కడ ప్రజలకు తాలిబన్లు చుక్కలు చూపిస్తున్నారు. తలతిక్క నిర్ణయాలతో ఆడవారిని ఇంటికే పరిమితం చేయడం, స్త్రీలను విద్యకు, ఉద్యోగానికి దూరం చేశారు. కఠినంగా షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యునైటెడ్ నేషన్స్ వరల్డ్…
అసమ్మతి దెబ్బకు పదవిని వదులుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రవాస పౌరులను ఉద్దేశించి ఓ వీడియో సందేశంలో ఆయన అమెరికా తీరుపై వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో పాకిస్థాన్ లోని సైనిక స్థావరాలను ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని అమెరికా కోరినా తాను దానికి తలొగ్గలేదన్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికా వత్తిడికి నేను లొంగలేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలు వైదొలిగాక, పాక్ సైనిక…
ఆఫ్ఘనిస్తాన్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్‌లోని కుందూజ్ ఇమామ్ సాహిబ్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరంలో శక్తివంతమైన బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా.. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ బాంబు దాడి వెనుక ఐఎస్ఎస్ పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.…
దేశంలో నిరుద్యోగం, కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ధరల పెరుగుదల ఎలా వున్నా.. యువతను మత్తులో దించేందుకు ముఠాలు నిరంతరం పనిచేస్తున్నాయి. దేశాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతోంది. ఎక్కడ అవకాశం వుంటే అక్కడ డ్రగ్స్ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడిన గుజరాత్లో తాజాగా మరోమారు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లో గురువారం నాడు 256 కిలోల హెరాయిన్‌ను నార్కోటిక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ…