ఏ దేశంలో అయినా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. ప్రభుత్వాలకు అధిక ఆధాయం తెచ్చిపెట్టే వాటిల్లో మద్యం ఒకటి. అయితే, కొన్ని దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యపానంపై నిషేధం విధిస్తుంటాయి. అయితే, తాలిబన్ ఏలుబడి ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టాలకు లొబడి మద్యం పై నిషేధం విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మద్యం సేవించినా, అమ్మినా నేరం. ఇలాంటి నేరాలతో పట్టుబడితే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే…
కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు మానవతా దృక్పదంలో సహాయం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలకు మందులను సప్లై చేసింది. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్‌ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది.…
ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల పాలకుల మరో కోణం బయటపడింది. అక్కడ పాలన సాగిస్తున్న తాలిబన్లు మహిళలపై తాజాగా మరో హుకుం చేశారు. దూర ప్రయాణాలు చేసే మహిళలు ఖచ్చితంగా పురుషుడి తోడు తీసుకోవాలని ఆదేశించారు. దూర ప్రాంతాలకు వెళ్లే మహిళల వెంట కచ్చితంగా పురుషులు ఉండాల్సిందేనని, పురుషులు లేకుండా వచ్చే మహిళలకు రవాణా సౌకర్యం కల్పించవద్దని తాలిబన్ సర్కారు స్పష్టం చేసింది. 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలంటే వారితో పాటు కచ్చితంగా పురుషుడు వెంట…
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అరాచకాలను చూడాల్సి వచ్చింది.. అంతే కాదు.. ఆకలితో అలమటించిపోతున్నారు అక్కడి ప్రజలు.. భారత్ లాంటి దేశాలు ఆదుకోవాడికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.. ఇక, ప్రభుత్వాన్ని నడపడానికి తాలిబన్లు ఆపసోపాలు పడుతున్నారు.. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయ్యింది తాలిబన్ల పరిస్థితి.. ఎందుకంటే.. తన వద్దనున్న 8 లక్షల డాలర్లను పొరపాటున తన శత్రుదేశమైన తజికిస్తాన్‌కి పంపించారు తాలిబన్లు.. అంటే, ఇది భారత్ కరెన్సీలో రూ.6 కోట్లు అన్నమాట..…
చైనాలో పుట్టిన మాయదారి కరోనా మహమ్మారి.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉంది.. దీంతో.. అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి… భారత్ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన తర్వాత.. వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలంటూ.. ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోనివారిని కూడా చైతన్యం చేసే కార్యక్రమం జరుగుతోంది.. ఇక, భారత్‌లో నిన్నటి వరకు 137 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ జరిగింది.. ఇదే సమయంలో.. ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఉద్యోగాలు లేక, నిధులు లేక ఆకలితో ఆఫ్ఘన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. మానవతాదృక్పధంతో వివిధ దేశాలు సహాయం అందిస్తున్నాయి. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకోవడంతో తాలిబన్ల హస్తం ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేత సుహైల్ షాహిన్‌తో పాక్ జర్నలిస్ట్ ఫారూఖీ జమీల్ వీడియో ఇంటర్వ్యూ చేశారు. ఆ సమయంలో పాక్ జర్నలిస్ట్ జమీల్ తాలిబన్ ప్రతినిధికి ప్లైయింగ్ కిస్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచాడు.…
ఆప్ఘనిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పడిపోతుండటమే అక్కడ నిత్యావసర ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏ వస్తువు ధర చూసినా గుండె గుభేల్ అంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు అయితే నిత్యావసరాలను కొనుగోలు చేయలేక ఉన్న డబ్బులతో ఒకపూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నారు. Read Also: ఆకాశాన్నంటిన మునగాకాయ ధరలు ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ దేశంలో…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ లు ఆక్రమించుకున్నాక అక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాలిబన్ ప్రభుత్వంను అధికారికంగా ఏ దేశాలు గుర్తించలేదు. తాలిబన్లకు మిత్రులుగా ఉన్న పాక్, చైనాలు కూడా అధికారికంగా గుర్తించలేదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో 22 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుండగా, మరో 36 శాతం మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తాలిబన్ లు అధికారంలోకి వస్తే పాక్ ప్రాభల్యం పెరుగుతుందని, ఇది పోరుగునున్న భారత్‌కు ఇబ్బందికరమని, ఆఫ్ఘనిస్తాన్లో భారత్ చేపడుతున్న ప్రాజెక్టులకు,…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. దాదాపు అన్ని దేశాలు తమ ఎంబసీలను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. అంతర్జాతీయంగా తాలిబన్ ప్రభుత్వానికి గుర్తింపులేకపోవడంతో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. పైగా పలు ఉగ్రవాద సంస్థలు ఆఫ్ఘన్లో దాడులకు పాల్పడుతున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వం లేకపోవడంతో అమెరికా నిధులను నిలిపివేసింది. అయితే, మానవతా దృక్పధంతో ఇండియా వంటి దేశాలు ప్రజలు శీతాకాలంలో ఇబ్బందులు పడకూడదని 50 వేల మెట్రిక్ టన్నుల గోధుమలను, మందులను సరఫరా చేస్తున్నది. Read:…
ఇండియాకు పాక్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే వాహనాలకు అనుమతిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పదంతోనే వాహనాలకు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైనా ఆహారం అందక అలమటిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌కు సాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. Read: విచిత్రం: అంతపెద్ద పామును ఆ చేప ఎలా మింగేసింది? కాగా, ఇండియా…