Afghanistan: మహిళా న్యూస్ యాంకర్లు కూడా ఆ పని చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మహిళా జర్నలిస్టులపై కూడా ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్. న్యూస్ చదువుతున్న మహిళా యాంకర్లు తప్పకుండా తమ మొహాలను కప్పుకోవాలని ఆదేశాలు జారీ చేసింది ఆప్ఘన్ సర్కార్. ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రతీ మీడియా సంస్థ కూడా ఈ నిబంధనలను తప్పకుండా పాటించాలని హుకుం జారీ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల ఐక్యరాజ్యసమితి శరణార్థి సహయ కార్యక్రమాల్లో పని చేసే మహిళలు కూడా తప్పకుండా బుర్ఖా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంపై మహిళల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ విషయంపై తాలిబన్ అధికార ప్రతినిధి అకిఫ్ మజహర్ స్పందించారు. న్యూస్ చదువుతున్న సమయంలో మహిళ యాంకర్లు మొహాన్ని కప్పుకోవాలనే ప్రతిపాదనకు మీడియా ప్రతినిధులందరూ అంగీకరిచారని వెల్లడించారు. మే 21 వరకు అందరికి వెసులుబాటు ఉంటుందని… ఆ తరువాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేసింది తాలిబన్ సర్కార్.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
2021 ఆగస్టు 15న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆఫ్ఘన్ పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజలు ఆకలి కష్టాలు తీర్చుకోవడానికి కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నారు. కానీ తాలిబన్ ప్రభుత్వం ఇవేవి పట్టనట్లు వ్యవహరిస్తోంది. తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వరసగా దాడులు చేస్తున్నారు. ఆప్ఘన్ కు ఎక్కువగా నిధులు పాశ్చాత్య దేశాల నుంచే వస్తుంటుంది. అయితే తాలిబన్ అధికారం చేపట్టిన తరువాత విదేశీ సాయం దాదాపుగా నిలిచిపోయింది.
తాజావార్తలు
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..