Taliban: పాకిస్తాన్‌కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్‌కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం. ఇప్పుడు, భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నడుస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి పాక్‌లోకి వెళ్లే నదుల నీటిని సరిహద్దు దాటనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాలిబన్లతో ఆచరణాత్మక సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు.
Pakistan: పాకిస్తాన్ బయటకు ఎన్ని బీరాలు పలుకుతున్నా కూడా తోటి ముస్లిం దేశాలు పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా, యూఏఈ వంటి ఇస్లామిక్ దేశాలు పాకిస్తానీయులకు నో ఎంట్రీ బోర్డు పెడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వెళ్లిన వారు ఈ దేశాల్లో భిక్షాటన చేయడం, నేరాలకు పాల్పడుతుండటంతో ఆయా దేశాలు వీరికి వీసాలు మంజూరు చేయడం లేదు.
ఆఫ్ఘనిస్థాన్‌పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10 మంది చనిపోగా.. నలుగురు గాయపడినట్లుగా ఆప్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం రాత్రి 12 గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్‌లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో చావు తప్పించుకున్నప్పటికీ, ఆ దేశానికి సిగ్గు రావడం లేదు. తాజాగా, ఆయన మాట్లాడుతూ.. తూర్పు సరిహద్దులో భారత్‌తో, పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘానిస్తాన్‌తో టూ-ఫ్రంట్ వార్‌కు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. పాకిస్తాన్ రెండు దేశాలతో యుద్ధానికి ‘‘పూర్తిగా సిద్ధంగా ఉంది’’ అని అన్నారు. ఢిల్లీ ఉగ్రవాద దాడి సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య చర్చలు మళ్లీ విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. కానీ ఎలాంటి పురోగతి లేకుండా చర్చలు ముగిశాయి. రెండు దేశాల మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు.
Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీకి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఆఫ్ఘానిస్తాన్‌తో శత్రుత్వం విషయంలో పాక్ ప్రభుత్వాన్ని కాదని ఆసిమ్ మునీర్ వ్యవరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై దాడుల కోసం పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగిస్తోందని ఇటీవల తేలింది.
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్‌లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆప్ఘనిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం హడలెత్తించింది. సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మజార్-ఎ షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. భారతదేశం పాకిస్తాన్‌పై ద్విముఖ పోరు చేస్తుందని ఆరోపించారు. రెండు సరిహద్దుల్లో యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్‌ను భారత్ ప్రాక్సీగా ఉపయోగించుకుంటుందని ఆయన అన్నారు.