అఫ్గానిస్థాన్ మరోసారి బాంబుదాడులతో హోరెత్తింది. పశ్చిమ అఫ్గానిస్థాన్లోని హెరాత్ పట్టణంలో ఓ మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 18 మంది మృతి చెందగా.. 23 మంది గాయపడ్డారు.
Huge Blast At Mosque In Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి నెత్తురోడింది. తాలిబన్ నాయకులు, తాలిబన్ మద్దతు మతగురువు లక్ష్యంగా మసీదులో భారీ ఉగ్రదాడి జరిగింది. శుక్రవారం ప్రార్థనల్లో భాగంగా, ప్రార్థనలు చేస్తున్న సయమంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. పశ్చిమ ఆప్ఘనిస్తాన్ హెరాత్ నగరంలోని గుజార్గా మసీదులో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 21 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది…
Taliban celebrates 1st anniversary of US troops withdrawal: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ సంబారాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తాలిబాన్ ప్రభుత్వం సంబరాలు చేస్తోంది. ఆగస్టు 31న జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. 20 ఏళ్ల పాటు ఆప్ఘనిస్తాన్ లో ఉన్న యూఎస్ బలగాలు ఉపసంహరించుకుని ఏడాది గడవడంతో తాలిబన్లు మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగురంగలు లైట్లతో రాజధాని కాబూల్ మెరిసిపోతోంది.
Taliban refuses female students to leave Kabul for studies: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన ప్రారంభం అయి ఏడాది గడిచింది. 2021 ఆగస్టులో అధికారం చేజిక్కించుకున్న తాలిబన్లు.. అప్పటి నుంచి స్త్రీలపై వివక్ష చూపిస్తున్నారు. మహిళలు కేవలం ఇంటికే పరిమితం అవుతున్నారు. స్త్రీ విద్యను వ్యతిరేకిస్తున్నారు. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా కుటుంబంలోని మగవాళ్ల తోడు ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. షరియా చట్టాన్ని అమలు చేయడానికే తాలిబన్లు ప్రాధాన్యత ఇస్తున్నారు.
తాలిబన్ పాలన మొదలై సోమవారానికి ఏడాది పూర్తైనా ప్రపంచ దేశాలు మాత్రం వారిని అధికారికంగా గుర్తించకపోవడంతో ఇంకా ఏకాకిగానే మిగిలిపోయింది. ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తైన సందర్భంగా సెలవు దినంగా ప్రకటించారు.
Taliban cleric Killed In ISIS Suicide Blast : తాలిబన్ మత గురువు, ఆప్ఘాన్ లో కీలక నేతగా ఉన్న రహీముల్లా హక్కానీని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడిలో మరణించారు. ఐఎస్ఐఎస్ ను తీవ్రంగా వ్యతిరేకించే ఆయన్ను ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. గురువారం రహీముల్లా హక్కానీ.. కాబూల్ లోని అతని మదర్సాలో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో హక్కానీతో పాటు అతని సోదరుడు మరణించారని తాలిబన్…
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని షియా నివాస ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఘోర పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ పేలుడులో కనీసం ఎనిమిది మంది మరణించారని, 18 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
Ayman al-Zawahiri-Taliban: అల్ ఖైదా చీఫ్ ఐమన్ అల్ జవహరిని హతమార్చినట్లు స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ ప్రకటించారు. 9/11 అమెరికా ట్విన్ టవర్స్ దాడులపై ప్రతీకారం తీర్చుకున్నామని అమెరికా భావిస్తోంది. అమెరికన్లకు హాని తలపెట్టే ఏ ఒక్క ఉగ్రవాదిని ఉపక్షించబోం అని అమెరికా చెబుతోంది. ఇటీవల కాబూల్ లో ఆశ్రయం పొందుతున్న అల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా తన డ్రోన్ నుంచి క్షిపణిని ప్రయోగించి హతం చేసింది. రాజధా
Earthquake Hits Philippines: ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉత్తర ఫిలిప్పీన్స్ ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. రాజధాని మనీలాకు 300 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం ధాటికి రాజధానిలోని ఎత్తైన భవనాలు కుదుపులకు లోనైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుధవారం ఉదయం 8.43 గంటలకు అబ్రా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది.