చైనాలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరోసారి భూకంపం వచ్చింది. జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్ లో ఆదివారం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అంతకుముందు రోజు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ నెలలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అంతకుముందు జూన్ నెలలోనే ఇదే జిన్జియాంగ్ ప్రావిన్స్ లో భూకంపాలు సంభవించాయి.
Read Also: F3 Movie: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘F3’.. స్ట్రీమింగ్ డేట్ లాక్
శనివారం ఇరాన్ దక్షిణ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంట్లో ముగ్గురు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఇరాన్ లో వచ్చిన భూకంపం ధాటికి యూఏఈ, బహ్రైన్, ఖతార్ దేశాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జూన్ నెలలో ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం ఆ దేశాన్ని కుదిపేసింది. 6.1 తీవ్రతతో పక్టికా ప్రావిన్స్ లో భూకంపం సంభవించింది. ధీని ధాటికి 1000 మరణించగా.. 1500 మంది గాయపడ్డారు. తాలిబన్ సర్కార్ తమకు సాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరింది.