In a recent speech at an event in Kabul on Friday, the Taliban's supreme leader Mawlawi Haibatullah Akhundzada warned foreigners to stop meddling in Afghanistan's affairs and politics.
చైనాలో వరసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఆదివారం మరోసారి భూకంపం వచ్చింది. జిన్ జియాంగ్ ఉయ్గర్ అటానమస్ రీజియన్ లో ఆదివారం 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని చైనా ఎర్త్క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. అంతకుముందు రోజు శనివారం కూడా జిన్జియాంగ్ ప్రావిన్స్ లో రిక్టర్ స్కేల్ పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ నెలలో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ లో 5.8 తీవ్రతతో భూకంపం…
ఇరాన్ శక్తివంతమైన భూకంపంతో వణికింది. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్లో రిక్టర్ స్కేల్ పై 6.0తో భూకంపం సంభవించింది. హెర్మోజ్ ప్రావిన్స్ లోని బందర్ అబ్బాస్ నగరానికి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదు అయింది. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం ఎనిమిది మందికి గాయాలు కాగా.. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ భూకంపం వల్ల సరిహద్దు దేశాలైన…
ఆఫ్ఘనిస్తాన్ లో శనివారం సిక్కులను, హిందువులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడి చేశారు. కాబూల్ లోని బాగ్-ఇ బాలా ప్రాంతంలో గురుద్వారా కార్తే పర్వాన్ లక్ష్యంగా ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఈ దాడిలో ఒక సిక్కుతో పాటు ఇద్దరు వ్యక్తులు మరణించారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గుర్ని అక్కడి భద్రతాబలగాలు హతమార్చాయి. గురుద్వారాలో శనివారం ఉదయం 30 మంది వరకు ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు గ్రెనేడ్స్ తో విరుచుకుపడ్డారు. గ్రెనెడ్ విసరడంతో గురుద్వారాలో మంటలు చెరేగాయి.…
ఆఫ్ఘనిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మైనారిటీలే లక్ష్యంగా రాజధాని కాబూల్ నగరంలోని కార్తే పర్వాన్ ప్రాంతంలోని గురుద్వారాను టార్గెట్ చేశారు. శనివారం ఉదయం కార్తే పర్వాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో హిందువులు, సిక్కులు చిక్కుపోయినట్లు తెలుస్తోంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 8.30 గంటలకు దాడి జరిగింది. గురుద్వారాకు గార్డుగా ఉన్న వ్యక్తిని చంపేశారు ఉగ్రవాదులు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా కార్తే పర్వాన్ గురుద్వారా సమీపంలో పేలుడు సంభవించింది. గురుద్వారా ద్వారం…
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఆఫ్ఘన్ లో ప్రజా ప్రభుత్వ ఉన్న సమయంలో స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించే వారు. అయితే తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత కేవలం వంటిళ్లకే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా.. భర్త లేదా బంధువులు తోడుంటేనే అనుమతి.. కాదని రూల్స్ ఉల్లంఘిస్తే కొరడా దెబ్బలతో శిక్షించడం ఇది తాలిబన్ల రాక్షస పాలన. తాజాగా తాలిబన్ పాలనలో ఓ ఆఫ్ఘన్ జర్నలిస్టు పరిస్థితి…
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం చేజిక్కించుకున్న తరువాత ఆ దేశం నుంచి ఇండియాకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని రోజుల్లో ఇండియాకు ఆఫ్ఘన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభించాలని అరియానా ఆఫ్ఘన్ ఎయిర్ లైన్స్ భావిస్తోంది. భారత్ తో తాలిబన్లు దౌత్య సంబంధాలను పున: ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆఫ్ఘన్ తో దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి భారత్ నుంచి అత్యున్నత ప్రతినిధి బృందం కాబూల్ వెళ్లింది. అక్కడ ప్రభుత్వ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్…
ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పుడు తాలిబన్ రాజ్యం నడుస్తోంది. వాళ్లు చెప్పిందే వేదం, చేసిందే చట్టం అక్కడ. మహిళలకు పెద్దగా హక్కులేం ఉండవు తాలిబన్ పాలనలో. ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు తాలిబన్ పాలకులు. ఇప్పటికే మహిళలపై పలు రకాలుగా ఆంక్షలు విధిస్తున్నారు. మహిళలను కేవలం వంటిళ్లకే పరిమితం చేశారు. బయటకు వస్తే ఖచ్చితంగా బుర్ఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దీంతో పాటు భర్త, అన్న ఎవరైనా తోడు ఉంటేనే బయటకు రావాలనే ఆంక్షలను విధించారు. ఇదిలా…