Afghanistan: ఒకప్పుడు ఫేమస్ న్యూస్ యాంకర్.. ఇప్పుడు వీధి వ్యాపారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ చాలా మంది జీవితాలు తలకిందులయ్యాయి. ఆఫ్ఘన్ లో ప్రజా ప్రభుత్వ ఉన్న సమయంలో స్త్రీలు ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్వహించే వారు. అయితే తాలిబన్ల పాలన వచ్చిన తర్వాత కేవలం వంటిళ్లకే పరిమితం అయ్యారు. బయటకు వెళ్లాలన్నా.. భర్త లేదా బంధువులు తోడుంటేనే అనుమతి.. కాదని రూల్స్ ఉల్లంఘిస్తే కొరడా దెబ్బలతో శిక్షించడం ఇది తాలిబన్ల రాక్షస పాలన.
తాజాగా తాలిబన్ పాలనలో ఓ ఆఫ్ఘన్ జర్నలిస్టు పరిస్థితి తలకిందులైన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. మూసా మొహమ్మదీ కథ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రజా ప్రభుత్వం ఉన్న సమయంలో మొహమ్మదీ టాప్ న్యూస్ యాంకర్, జర్నలిస్టుగా ఉండేవాడు. అనేక ఛానెళ్లలో యాంకర్, రిపోర్టర్ గా చాలా ఏళ్లు పనిచేశాడు. ఇప్పుడు అతని కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో తినుబండారాలను అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్నాడు.
Also Read
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- Pakistan: ‘‘నెల రోజులు ఆఫీస్‌కు రాని నేత’’.. పాక్ ప్రధాని ముందే నక్వీ షాకింగ్ కామెంట్స్..
ఇటీవల హమీద్ కర్జాయ్ ప్రభుత్వంలో పనిచేసిన కబీర్ హక్మల్ ఇటీవల ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు.. దేశంలో అనేక ప్రతిభావంతులైన నిపుణులు పేదరికంలోకి ఎలా నెట్టబడ్డారో చూపించారు. మొహమ్మదీ కథ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఈ విషయం నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వచ్చింది. తన డిపార్ట్ మెంట్ లో మొహమ్మదీని నియమిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఆర్థిక, మనవతా సంక్షోభం ఏర్పడింది. చాలా మంది ప్రజలు పేదరికంలోకి నెట్టివేయబడ్డారు. ఏకంగా పిల్లలను అమ్ముకోవడంతో పాటు వాళ్ల అవయవాలను కూడా అమ్ముకుని బతుకుబండిని నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా అనేక మంది జర్నలిస్టులు, మహిళా ఉద్యోగులు వాళ్ల ఉద్యోగాలను కోల్పోయారు.
Journalists life in #Afghanistan under the #Taliban. Musa Mohammadi worked for years as anchor & reporter in different TV channels, now has no income to fed his family. & sells street food to earn some money. #Afghans suffer unprecedented poverty after the fall of republic. pic.twitter.com/nCTTIbfZN3
— Kabir Haqmal🇦🇫 (@Haqmal) June 15, 2022
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?