2021 ఆగస్ట్ 21నుంచి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో మాదిరిగా కాకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలిగించబోమని, మహిళల హక్కులు కాపాడతామని స్పష్టం చేశారు. కానీ చెప్పింది ఒకటి చేస్తున్నది మరొకటిగా మారింది. మహిళలకు ఎలాంటి హానీ తలపెట్టబోమని చెబుతూనే వారిని హింసిస్తున్నారు. మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికే పరిమితం చేశారు. అంతేకాదు, గతంలో మాజీ ప్రభుత్వ సభ్యులు, మాజీ భద్రతాదళ…
ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్ర సంక్షోభం నెలకొన్నది. ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావోస్తున్నది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఆ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడి పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి. విదేశాల్లో ఆఫ్ఘన్ నిధులు ఫ్రీజ్ కావడంతో ఆర్థికంగా ఆ దేశం కుదేలయింది. ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందక జబ్బుల బారిన పడుతున్నారు. గతంలో చాలా మంది పిల్లల ఆకలి తీర్చేందుకు కిడ్నీలను అమ్ముకున్నారు. కాగా,…
క్రికెట్లో పసికూన ఆఫ్ఘనిస్థాన్ సంచలనం సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్‌లో తొలిసారి సెమీఫైనల్ పోటీలకు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని ఆఫ్ఘనిస్థాన్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించడంతో 135 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక కేవలం 130 పరుగులకే పరిమితమైంది. Read Also: ప్రతి జట్టులో ధోనీ లాంటోడు ఉండాలి.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ప్రశంసలు ఈ మ్యాచ్‌లో…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచ దేశాలు ఆ దేశంపై నిషేధం విధించాయి. ఏ దేశం కూడా ఇప్పటి వరకు తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. దీంతో ఆ దేశానికి చెందిన విదేశీ నిధులు స్తంభించిపోయాయి. దీంతో దేశంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఉద్యోగాలు కోల్పోయాలు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్దరించామని, ఇప్పటికైనా దేశాలు తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని…
ఆఫ్ఘనిస్తాన్‌ను భూకంపం వణికించింది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్లోని బాద్గిస్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3 గా నమోదైంది. భూకంపం తాకిడికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి. శిధిలాల కింద చిక్కుకొని 26 మంది మృతి చెందారు. తుర్కుమెనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బాద్గిస్ ప్రావిన్స్‌లో వరసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదటిసారి వచ్చిన భూకంపం తీవ్రత 5.3గా ఉండగా, రెండోసారి వచ్చిన భూకంపం తీవ్రత 4.9గా నమోదైంది. రెండు భూకంపాల ధాటికి వందలాది ఇల్లు నేలమట్టం అయ్యాయి.…
ఆఫ్ఘనిస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. తాలిబన్ల అకృత్యాలకు ఓ సంగీత విద్వాంసుడు తీవ్రంగా నష్టపోయాడు. తన జీవనోపాధిపై తాలిబన్లు దెబ్బకొట్టారు. సంగీత విద్వాంసుడి సంగీత వాయిద్యాన్ని అతని కళ్లముందే తగలబెట్టి ఎంజాయ్ చేశారు. పాపం ఆ సంగీత విద్వాంసుడు కంటతడి పెట్టుకుంటే అతనిని చూసి తాలిబన్లు పగలబడి నవ్వుతూ ఎంజాయ్ చేశారు. ఈ తతంగాన్ని వీడియో తీస్తూ దారుణానికి ఒడిగట్టారు. చుట్టు ప్రజలు చేరి చోద్యం చూస్తున్నారు తప్పించి ఇదేంటని ఎవరూ ప్రశ్నించలేదు. తాము ప్రజల్లో గొప్ప మార్పును…
ఆర్థిక సంక్షోభంతో ఆఫ్ఘానిస్తాన్ అతలాకుతలం అవుతోంది. తినడానికి తిండి లేక, చేయడానికి పనిలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చివరికి తినడానికి డబ్బులు లేక తమ అవయాలు సైతం అన్నుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇటీవల డబ్బు కోసం కిడ్నీలను అమ్ముకుంటున్న ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువైపోతున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పనిచేసే సత్తా ఉన్నా పని లేక.. చేసే పనికి వచ్చే డబ్బులు చాలక.. కుటుంబంలోని మగవాళ్ళు…
ఏ దేశంలో అయినా మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. ప్రభుత్వాలకు అధిక ఆధాయం తెచ్చిపెట్టే వాటిల్లో మద్యం ఒకటి. అయితే, కొన్ని దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యపానంపై నిషేధం విధిస్తుంటాయి. అయితే, తాలిబన్ ఏలుబడి ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ చట్టాలకు లొబడి మద్యం పై నిషేధం విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మద్యం సేవించినా, అమ్మినా నేరం. ఇలాంటి నేరాలతో పట్టుబడితే వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే…
కరోనా సమయంలో భారత్ అనేక దేశాలకు మానవతా దృక్పదంలో సహాయం చేసింది. అమెరికాతో సహా అనేక దేశాలకు మందులను సప్లై చేసింది. కోవిడ్ మొదటి దశలో ఇండియా నుంచి మలేరియా మెడిసిన్‌ను వివిధ దేశాలకు ఉచితంగా సప్లై చేసింది. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను తయారు చేసిన తరువాత కూడా ఇండియా మిత్ర దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్‌ను మానతవతా దృక్పధంలో అందించింది. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌కు 5 లక్షల కోవాగ్జిన్ డోసులను సరఫరా చేసింది.…
ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబన్ల పాలకుల మరో కోణం బయటపడింది. అక్కడ పాలన సాగిస్తున్న తాలిబన్లు మహిళలపై తాజాగా మరో హుకుం చేశారు. దూర ప్రయాణాలు చేసే మహిళలు ఖచ్చితంగా పురుషుడి తోడు తీసుకోవాలని ఆదేశించారు. దూర ప్రాంతాలకు వెళ్లే మహిళల వెంట కచ్చితంగా పురుషులు ఉండాల్సిందేనని, పురుషులు లేకుండా వచ్చే మహిళలకు రవాణా సౌకర్యం కల్పించవద్దని తాలిబన్ సర్కారు స్పష్టం చేసింది. 45 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాలంటే వారితో పాటు కచ్చితంగా పురుషుడు వెంట…