పచ్చి నెత్తురు తాగే పెద్ద పులి పచ్చిగడ్డి తింటుందంటే నమ్ముతారా? తాలిబన్లు కూడా అంతే. ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ అరాచకాలు మొదలయ్యాయి. హాలీ మెక్ కే అనే అమెరికా జర్నలిస్టు తాలిబన్ల ఘాతుకాలను కళ్లారా చూసింది. డల్లాస్ మార్నింగ్ న్యూస్ కోసం పని చేస్తున్న ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ..చూసిన దాన్ని బట్టి ..ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు దారుణాలకు పాల్పడతున్నారు. దాంతో ఇన్నాళ్లూ స్వేచ్చగా జీవించిన అమ్మాయిల బతుకులు ఇప్పడు…
ఢిల్లీలోని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ చాలా ప్రసిధ్ది. దేశంలోని నలుమూలలకు ఢిల్లీ నుంచే డ్రై ఫ్రూట్స్ సరఫరా అవుతాయి. ఆప్ఖనిస్తాన్ తో భారత్ దేశం సుమారు ( 400 మిలియన్ అమెరికన్ డాలర్లు) 4 వేలకోట్ల రూపాయల మేరకు డ్రై ఫ్రూట్స్ బిజినెస్ నిర్వహిస్తుంది. ఆప్ఘనిస్తాన్ కు భారత్ ఓ పెద్ద మార్కెట్. పాత ఢిల్లీలోని, జమా మసీదు సమీపంలో “ఖారీ బావ్లీ” ప్రాంతంలో ఉన్న డ్రై ఫ్రూట్స్ హోల్ సేల్, రిటైల్ మార్కెట్లు వెలవెలబోతున్నాయు. ఆప్ఘనిస్తాన్…
అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటుంన్నట్టు ప్రకటించిన తరువాత పూర్తిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. అంత త్వరగా తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారని అనుకోలేదు. దీంతో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 31 వరకు ఆఫ్ఘన్‌లోని అమెరికా పౌరులను, అమెరికా అధికారులను తరలించాలని సైన్యం టార్గెట్ పెట్టుకుంది. ఆగస్టు31 వరకు ఆ దేశాన్ని పూర్తిగా ఖాళీచేసి వచ్చేయాలని అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆగస్టు 31 వరకు…
ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నాం.. ఇక, మాకు ఎదురేలేదు అని భావిస్తున్న తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.. ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణ ప్రాంతంలోని ఆండ్రాబ్ ప్రావిన్స్‌లో తాలిబాన్-ఆఫ్ఘన్ సైన్యం మధ్య భీకర యుద్ధమే నడుస్తోంది… తాలిబన్లు స్వాధీనం చేసుకోని కొన్ని ప్రాంతాల్లో పంజ్‌షీర్ లోయ ఒకటి కాగా.. ఆ ప్రాంతానికి వెళ్లిన తాలిబన్లకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. ఆంధ్రాబ్ ప్రావిన్స్‌లో జరిగిన పోరులో ఇప్పటి వరకు 50 మందికి పైగా తాలిబన్ ఫైటర్లు మరణించినట్టుగా తెలుస్తోంది……
ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని…
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో అరాచకం రాజ్యమేలుతోంది… తాలిబన్లు తమకు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు.. తాజాగా ఆఫ్ఘన్ రాజధానిలోని కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర తాలిబన్లు గాల్లోకి కాల్పలులు జరిపారు.. ఇతర దేశస్తులతో పాటు.. ఆఫ్ఘన్‌లు దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తూ.. ఎయిర్‌పోర్ట్‌లకు పెద్ద సంఖ్యలో తరలిస్తున్నారు.. అయితే, వారిని నిలువరించడానికి కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర కాల్పులు జరిపారు తాలిబన్లు.. దీంతో.. భయాందోళనకు గురైన ప్రజలు.. ఒక్కసారిగా పరుగులుపెట్టారు.. దీంతో తొక్కిసలాట జరిగింది.. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి…
అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇదిలావుంటే, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తెలిపారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని, అది అనవసరం కూడా అని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన…
కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఎంతోమంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ తనదైన రీతిలో స్పందించారు. తాలిబన్లతో పోరాటం సాగించిన ఆఫ్ఘన్ పట్టణాలలో జనజీవనం అతలాకుతలమైందని, అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని సోనూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అక్కడ నివాసమున్న ఎంతోమంది…