ఆఫ్ఘనిస్థాన్‌లో పాలనా వ్యవహారాలను చేపట్టేందుకు… ప్రయత్నాలను ముమ్మరం చేశారు తాలిబన్లు. దీనిపై కసరత్తు ఇప్పటికే పూర్తి చేసినట్లు తాలిబన్ వర్గాలు తెలిపాయి.. ఈ రోజు ప్రార్థనలు ముగిసిన తర్వాత.. ఆఫ్ఘన్‌లో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అధ్యక్ష భవనంలో కార్యక్రమం ఉంటుందని తాలిబన్ల అధికార ప్రతినిధులు తెలిపారు. గత సర్కారులోని కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది.…
అమెరికా పారిపోయింది..! అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తాలిబన్లు తమ వశం చేసుకున్నారు. ఈ సమయంలో తాలిబన్లతో ఇండియా చర్చలకు సిద్ధమైందా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఖతార్‌లోని దోహాలో తాలిబన్ పొలిటికల్ అఫైర్స్ చీఫ్ మహమ్మద్ అబ్బాస్‌తో భారత రాయబారి దీపక్ మిట్టల్ సమావేశమయ్యారు. అఫ్ఘానిస్తాన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా తిరిగి తీసుకొచ్చే అంశంపై చర్చించారు. దీంతో పాటు భారత్‌కి వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాదులకు, ఉగ్ర కార్యకలాపాలకు అఫ్ఘానిస్తాన్‌లో ఆశ్రయం కల్పించొద్దని దీపక్ మిట్టల్ స్పష్టం చేశారు.…
ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో తెలియదు… ఎక్కడ ఏ ఆత్మాహుతి దాడికి తెగబడతారో తెలియదు..దేశమంతా హైటెన్షన్….. భయం గుప్పిట్లో ఆఫ్గన్ ప్రజలు మరి కొన్ని గంటల్లో ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగాలి. ఆగస్టు 31 నాటికి ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దాని మిత్రదేశాలకు చెందిన సైనికులంతా వెళ్లిపోవాలి. ఇది అమెరికా-తాలిబాన్ల మధ్య డీల్. సో డెడ్‌లైన్ దగ్గరవుతోంది. ఇంకో 24 గంటలే ఉంది. అమెరికా తరలింపు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా…
ఐసిస్‌పై అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. కాబూల్ పేలుళ్లకు పాల్పడ్డ ఐసిస్-కె టెర్రరిస్టులపై డ్రోన్ దాడులు జరిపింది. పేలళ్ల బాధ్యులైన వారిని వెంటాడి వేటాడి చంపుతాం అని అధ్యక్షుడు జో బైడన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా ఈ దాడులు చేపట్టింది. శనివారం తూర్పు ఆఫ్గనిస్తాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌లో డ్రోన్ ఆపరేషన్ ప్రారంభించింది. ఇస్లామిక్‌స్టేట్ తీవ్రవాదుల అడ్డాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో కాబూల్ పేలుళ్ల మాస్టర్‌మైండ్ హతమయ్యాడు. అయితే దీనిని అమెరికా సైనిక అధికారులు…
ఆఫ్ఘన్‌లో పరిస్థితులపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాలిబన్లు కాల్పులు జరిపి… 9 ఏళ్లు పూర్తవుతున్నా… ఓ బుల్లెట్ గాయం నుంచి కోలుకోలేకపోతున్నానని మలాలా తెలిపారు. గత 40 సంవత్సరాలుగా దేశ ప్రజలు… లక్షల కొద్దీ బుల్లెట్లను ఎదుర్కొంటూనే ఉన్నారని వెల్లడించారు. ఆఫ్ఘన్‌లో తొలి ప్రావిన్స్‌ను ఆక్రమించుకున్న సమయంలో మలాలాకు సర్జరీ జరిగింది. ఆ ఆపరేషన్ నుంచి ఇటీవలే కోలుకున్న ఆమె.. ప్రస్తుత ఆఫ్ఘన్ పరిస్థితులపై స్పందించారు. తాలిబన్ల చర్యలతో…
అమెరికా బలగాలు ఉపసంహరించుకున్నాయో లేదో.. ఆఫ్గనిస్తాన్‌లో అప్పుడే కల్లోలం. తాలిబన్ల చేతుల్లోకి దేశం ఇంకా పూర్తిగా వెళ్లనే లేదు… అప్పుడే అట్టుడుకుతోంది. బాంబు పేలుళ్తో దద్దరిళ్లుతోంది. ఇంకా ఏమేం చూడాలో తెలియక ఆఫ్గన్లు వణికిపోతున్నారు. తాజా పేలుళ్ల పాపం తాలిబన్లదు కాదు. కానీ దాని మీద కక్షతో ఇస్లామిక్ స్టేట్ చేసిన పని అది. ఐఎస్ ఆఫ్ఘన్ శాఖ ఇస్లామిక్ స్టేట్ -ఖోరాసన్ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. అయితే అది ఎవరిని టార్గెట్ చేసి దాడులకు దిగింది?…
ఆఫ్ఘన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కూలిపోయిన తరువాత తాలిబన్ల పాలనలోకి వచ్చింది. ఇంకా పూర్తి స్థాయిలో అధికారుల బదలాయింపు ప్రక్రియ పూర్తికాలేదు. అధికార బదలాయింపు పూర్తికాకుండానే అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజున కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లే ఇందుకు కారణం. ఆఫ్ఘన్‌లో భద్రత ఏ స్థాయిలో ఉన్నదో నిన్నటి సంఘటనతో తేలిపోయింది. తాలిబన్లకు పాలన అప్పగిస్తే ఐసిస్, అల్‌ఖైదా వంటి అంతర్జాతీయ నిషేదిత ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత యుద్దాలతో,…
ఆఫ్ఘనిస్తాన్ పై అఖిలపక్ష సమావేశం ముగిసింది. అనంతరం లోక్ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మిథున్ రెడ్డి మాట్లాడుతూ… ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా తీసుకురావాలని కోరాం. ఆఫ్ఘనిస్థాన్ లో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం చాలా విలువైంది. తాలిబన్లతో చర్చలు జరిపి అందరిని క్షేమంగా తీసుకురావాలి అని పేర్కొన్నట్లు తెలిపారు. మన దేశం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి. భారతీయులను, పెట్టుబడులను కూడా పరిరక్షించాలి.…
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అరాచక పాలన సాగుతున్నది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వ్యాపార సంస్థలను తెరవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు వ్యాపారులు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. బడా వ్యాపారవేత్తలు అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండలేమని చెప్పి ముందుగానే దేశం వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఓ వ్యక్తి నిర్వహిస్తున్న వ్యాపారం దివ్యంగా సాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అజీజ్ గ్రూప్‌కు మంచి…