కొన్ని సంవత్సారాల కిందట 12 వేల ఆఫ్ఘన్ ముష్కర ముఠాను ఓడించారు 21 మంది సిక్కు యోధులు. ఈ పోరాటం యూరోప్‌లోని అన్ని పాఠశాలల్లో బోధించబడుతుంది కానీ మన దేశ పాఠ్యపుస్తకాల్లో ఈ మహాద్భుత ఘట్టానికి చోటుండదు. ఒక వైపు 12 వేల మంది ఆఫ్ఘని దొంగలు … మరో వైపు 21 మంది సిక్కుల మధ్య ఒళ్ళు గగ్గురు పొడిచే పోరాటం జరిగింది.. “గ్రీక్ సపర్త” మరియు “పర్షియన్” యుద్ధం గురించి మీరు వినే ఉంటారు.…
ప్రపంచానికి హానికరంగా మారిన ఉగ్రవాదులను ఎదురించే దమ్ము అగ్రరాజ్యాలకు సైతం లేదని అప్ఘన్ సంఘటన నిరూపించింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ప్రసంగాలతో దంచికొట్టే దేశాలన్నీ ఇప్పుడు ఏం అయ్యాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆయుధ సంపత్తిలో మేటిగా ఉన్న చైనా, అమెరికా లాంటి దేశాలు తాలిబన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు కొమ్ము కాస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికీ వారు సొంత ప్రయోజనాలతో తాలిబన్లకు పరోక్షంగా మద్దతు ఇస్తుండటం ప్రస్తుత అప్ఘన్ దుస్థితికి కారణమనే విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. ఈ పరిణామాలన్నీ…
అఫ్గనిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్ల ప్రభుత్వ అధినేతగా ముల్లా మహమ్మద్ హసన్ అఖుంద్ పేరు ఖరారైంది. తాలిబాన్ల అత్యున్నత నిర్ణయక మండలి అయిన ‘రెహబరీ షురా’ ఈ మేరకు ఓ నిర్ణయానికి వచ్చింది. ముల్లా హసన్ ప్రస్తుతం ‘రెహబరీ షురా’ కమిటీకి అధినేతగా కీలక పాత్ర వహిస్తున్నారు. ప్రస్తుతం కాందహార్‌లో ఉంటూ వ్యవహారాలు నడిపిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ బాధ్యతల్లో ఉన్నారు. 1996 లో ఏర్పడ్డ తాలిబాన్ ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా…
అఫ్షనిస్తాన్ దేశం మొత్తం తాలిబన్ల వశం కాకుండా ఆపుతున్నది ఏదైనా ఉందంటే అది పంజ్ షీర్ మాత్రమే. ఇప్పటికే అప్ఘనిస్తాన్ అంతటినీ ఆక్రమించిన తాలిబన్లు పంజ్ షీర్ ను మాత్రం హస్తగతం చేసుకోలేకపోయారు. ఈక్రమంలోనే ఇరువర్గాల మధ్య పంజ్ షేర్లో భీకరపోరు నడుస్తోంది. అయితే పంజ్ షేర్ ను తాము పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్లు ప్రకటిస్తుండగా.. అదేమీ లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా తాలిబన్లను తమ…
అమెరికా పేరు చెబితేనే అదొక భూతలస్వర్గమని అని అందరూ చెబుతుంటారు. స్వేచ్ఛ, సమానత్వానికి అమెరికన్లు దిక్సూచిగా నిలుస్తుంటారు. శక్తి, సంపద, రక్షణ వ్యవస్థ వంటి విషయాల్లో అమెరికా అన్ని దేశాల కంటే ముందంజలో ఉంటుంది. దీంతో అమెరికాకు ప్రపంచ పెద్దన్న పాత్ర పోషించే అవకాశాన్ని ప్రపంచ దేశాలిచ్చాయి. అయితే ఇటీవల కాలంలో అమెరికా అవలంభిస్తున్న తీరుతో ఆదేశ ప్రతిష్ట మసకబారుతోంది. దీంతో అమెరికాకు ప్రపంచాన్ని లీడ్ చేసే అవకాశం లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అప్ఘనిస్తాన్…
అమెరికా బలగాల ఉపసంహరణతో కాబూల్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణాలు నిలిచిపోయాయి. తాలిబన్లు విమానాశ్రయాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడి విమానాలు అక్కడే నిలిచిపోయాయ్. విమానాశ్రయం లోపల తాలిబన్లు…హాయిగా సేద తీరుతున్నారు. నాటో దళాలు ఉపయోగించిన ప్రత్యేక దుస్తులు, ఇతర సామాగ్రి…చిందరవందరగా పడిపోయింది. బట్టలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయ్. వీటిలో పనికి వచ్చే వాటిని…తాలిబన్లు ఏరుకుంటున్నారు. యుద్దానికి ఉపయోగించిన హెలికాప్టర్లు పనికిరాకుండా పోయాయ్. జీపులు, ట్రక్కులు…ధ్వంసమయ్యాయి. తాజాగా కాబుల్‌లోని హమీద్ కర్జాయ్ విమానాశ్రయం…తిరిగి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అయితే దేశీయ…
అప్ఘనిస్థాన్ లో తాలిబన్లకు, షంజ్ షేర్ యోధులకు మధ్య భీకరపోరు నడుస్తున్న సంగతి అందరికీ తెల్సిందే. విజయమో.. వీరమరణామో అన్న రీతిలో షంజ్ షేర్ సైన్యం తాలిబన్లపై విరుచుకుపడుతోంది. తమ మాతృభూమిని తాలిబన్లకు దక్కనిచ్చేది లేదని ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పంజ్‌షీర్ నాయకుడు మసూద్ ప్రకటించారు. నార్తర్న్ అలయెన్స్ పేరిట ఏర్పడిన గ్రూప్ ఆఫ్ఘన్ తాలిబన్ల వశం కాకుండా పోరాడుతోంది. అయితే దీనికి విరుద్దంగా తాలిబన్లు మాత్రం తాము పంజ్ షేర్ ను స్వాధీనం చేసుకున్నట్లు…
అప్ఘన్లో రోజురోజుకు అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాలిబన్ల దెబ్బకు జడిసిన ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పలాయనం చిత్తగించాడు. దీంతో ఆ దేశంలో తాలిబన్లకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్కడి ప్రజలకు తాలిబన్ల పాలన ఇష్టం లేనప్పటికీ వారికి వారే గత్యంతరంలేని పరిస్థితులు తలెత్తాయి. ఈ పరిస్థితులను ఆసరాగా తీసుకున్న తాలిబన్లు ఆఫ్ఘన్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ఈక్రమంలోనే తాలిబన్లు తమ ప్రభుత్వ ఏజెండాను ప్రకటించారు. తమకు సంబంధించి మిత్రులెవరో..…
ఏరుదాటేదాక ‘ఓడ మల్లన్న’.. ఏరు దాటాక ‘బోడ మల్లన్న’ అన్నట్టుగా ఉంది తాలిబన్ల వ్యవహారశైలి. అప్ఘనిస్తాన్ దేశాన్ని వశపరుచుకోవడానికి ముందు అమెరికాకు, ప్రపంచానికి కల్లబొల్లి మాటలు చెప్పిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశం ఆక్రమణలోకి వచ్చాక తమ అసలు రంగును బయటపెడుతున్నారు. భారత్ సహా ప్రపంచదేశాలకు ఎసరు పెడుతున్నారు. మొన్నటివరకు ‘కశ్మీర్’పై సంబంధం లేదన్న తాలిబన్లు ఇప్పుడు తగ్గేదేలే అంటూ భారత్ వ్యతిరేక ప్రకటన చేయడం సంచలనమైంది. అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మరోసారి తమ…
కరోనా మహమ్మరితో ప్రపంచం ఓవైపు పోరాడుతుండగా అప్ఘన్ మాత్రం తాలిబన్లతో పోరాడాల్సి వస్తోంది. అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్లు అప్ఘన్లో రెచ్చిపోతున్నారు. తాలిబన్ల దురాక్రమణతో ఆదేశ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాలిబన్ల రాక్షస పాలన ఇదివరకే ఓసారి చూసిన అప్ఘన్లు వారి పాలనను ఒప్పుకునేది లేదని తెగెసి చెబుతున్నారు. తాలిబన్లు మాత్రం తమ పాలనను అప్ఘన్లు ఒప్పుకోవాల్సిందే.. లేదంటే చావాల్సిందే అన్నట్లుగా…