అఫ్ఘానిస్థాన్‌లో యుద్ధం సంపూర్ణంగా ముగిసిందని తాలిబన్లు తాజాగా ప్రకటించారు. అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడం పట్ల.. అఫ్ఘాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పాశ్చాత్య దేశాలు తమ సిబ్బందిని వేగంగా స్వదేశానికి తరలించేందుకు ప్రస్తుతం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాలిబన్ల ధాటికి ప్రభుత్వ సేనలు చెల్లాచెదురవడంతో.. ఊహించిన దానికంటే ముందుగానే అఫ్ఘానిస్థాన్.. తాలిబనిస్థాన్ గా మారింది. 20 ఏళ్లుగా జరుగుతున్న పోరాటాన్ని తాలిబన్లు పది రోజుల్లోనే ముగించారు. ఒకటొకటిగా అఫ్ఘానిస్తాన్‌లోని కీలక పట్టణాలన్నింటినీ…
సినిమా షూటింగ్ విషయంలో ఎంత టెక్నాలజీ వచ్చిన పూర్తి న్యాచురాలిటీని తీసుకురావడం చాలా కష్టం.. ప్రస్తుతం గ్రాఫిక్స్ గిమ్మిక్కులు ఏలుతున్న కాలంలో సినిమా ఫ్రేమ్ లో ఎదో మిస్ అవుతున్న ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది. దీనికితోను కరోనా పరిస్థితులు కూడా సినిమా షూటింగ్స్ లొకేషన్స్ ను తారుమారు చేశారు. విదేశాలకు ప్లాన్ చేసిన.. పరిస్థితుల ప్రభావంతో దాదాపు ఆర్టిఫిషియల్ గా వేసిన సెట్స్ లోనే షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇక నార్త్, సౌత్ సినిమాల షూటింగులకు సంబంధించి…
అఫ్గనిస్తాన్ సంపూర్ణంగా తాలిబన్ల వశమైంది. మరోసారి ప్రజలు స్వంత దేశంలో బందీలైపోయారు. ఆడవారు, పిల్లల పరిస్థితి అయితే మరింత దారుణం. బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి. కానీ, అఫ్గాన్ ఎప్పుడూ ఇలాగే ఉండేదా? కాదంటోంది సీనియర్ నటి హేమా మాలిని. కొన్ని దశాబ్దాల క్రితం ‘ధర్మాత్మా’ అనే సినిమా విడుదలైంది. అందులో ధర్మేంద్ర, హేమా మాలిని జంటగా నటించారు. ఫిరోజ్ ఖాన్ ఓ గ్యాంగ్ స్టర్ గా, విలన్ గా నటించాడు. ఆ సినిమాలో హేమా మాలిని పాత్ర…
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఇప్పుడు తాలిబన్ల పాలన కావటంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ వార్త అయింది. ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు సురక్షితంగా దేశం నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం తాలిబన్లు చేస్తున్న అరాచకాలు, వారు ఆడే ఆటలు కూడా బయటకు వస్తున్నాయి. దీనిపై వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. వరుసగా ట్వీట్ల మీద ట్వీట్ తో ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితిని…
సినిమా వాళ్ళు సున్నిత మనస్కులు. చిన్న సంఘటన జరిగినా త్వరగా చెలించిపోతారు. కానీ అలాంటి సినిమా వాళ్ళే ఒక్కోసారి తమ ముందే అతి పెద్ద దారుణం జరిగినా స్పందించారు. ఆ కోవకు తాను చెందనని అంటున్నాడు అడివి శేష్. గత కొన్ని రోజులుగా ఆఫ్ఠనిస్థాన్ లో తాలిబన్లు చేస్తున్న దారుణ మారణ కాండను తెలియచేసే ఓ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి… ఆ లేఖ తన హృదయాన్ని బ్రద్దలు చేసిందని పేర్కొన్నాడు అడివి శేష్.…
ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల ప్రభావం జమ్మూకాశ్మీర్ సహా భారత్ పై అంతగా ఉండదు అని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం రుద్రారంలో ప్రైవేట్ యూనివర్సిటీ లో సెమినార్ కు హాజరైన ఒమర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోకి చొరబాటుదారుల సంఖ్య బాగా తగ్గింది, దేశ సరిహద్దులు పటిష్టంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపరిచేందుకు రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా జమ్మూకాశ్మీర్ ను…
ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం ఆఫ్ఘనిస్తాన్, దానిని ఆక్రమించుకున్న తాలిబన్లపైనే ఉన్నది. 2001 నుంచి 2021 వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు అండగా నాటో దళాలు, అమెరికా దళాలు రక్షణ కల్పిస్తూ వచ్చాయి. ఆఫ్ఘన్ సైన్యానికి అధునాతన ఆయుధాలతో పాటుగా, ఎలా పోరాటం చేయాలనే ట్రైనింగ్‌ను ఇచ్చారు. కానీ, అవేమి తాలిబన్ల ముందు పనిచేయలేకపోయాయి. 20 ఏళ్లతో ఆఫ్ఘన్‌లో జరిగిన అభివృద్ధి ఇప్పుడు ఏమౌతుందో అని భయపడుతున్నారు. 2001 నుంచి 2021 వరకు తాలిబన్లు పెద్దగా ప్రభావం చూపించకపోయినా, ఉనికిని…