ఆర్థిక సంక్షోభంతో ఆఫ్ఘానిస్తాన్ అతలాకుతలం అవుతోంది. తినడానికి తిండి లేక, చేయడానికి పనిలేక ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. చివరికి తినడానికి డబ్బులు లేక తమ అవయాలు సైతం అన్నుకుంటున్న దారుణ పరిస్థితి నెలకొంది. ఇటీవల డబ్బు కోసం కిడ్నీలను అమ్ముకుంటున్న ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ లో ఎక్కువైపోతున్నారు. తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పనిచేసే సత్తా ఉన్నా పని లేక.. చేసే పనికి వచ్చే డబ్బులు చాలక.. కుటుంబంలోని మగవాళ్ళు…
ఆప్ఘనిస్తాన్‌లో నిత్యావసర ధరలు చుక్కలను అంటుతున్నాయి. అమెరికా డాలర్‌తో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పడిపోతుండటమే అక్కడ నిత్యావసర ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. దీంతో అక్కడ ఏ వస్తువు ధర చూసినా గుండె గుభేల్ అంటోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజలు అయితే నిత్యావసరాలను కొనుగోలు చేయలేక ఉన్న డబ్బులతో ఒకపూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నారు. Read Also: ఆకాశాన్నంటిన మునగాకాయ ధరలు ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ దేశంలో…
అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. స్థానికంగా పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. మహిళల పరిస్థితి దీనంగా మారింది. తమను తాలిబన్లు వేటాడుతున్నారంటూ, ప్రాణభయం ఉందంటూ చాలామంది ఇది వరకే వాపోయారు. కొందరు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీతో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బాల్ఖ్ ప్రావీన్స్‌లోని మజారే షరీఫ్‌లో వీరు హత్యకు గురయ్యారు. ఓ…
అప్ఘాన్‌లో మగాళ్లకు గడ్డం ప్రాణ గండంగా మారింది. గడ్డం గొరిగిస్తే, ప్రాణం తీస్తామంటున్నారు తాలిబన్లు. షరియత్ చట్టాల్లో షేవింగ్‌కు స్థానం లేదంటూ బార్బర్ షాప్‌లకు వార్నింగ్‌లు పంపించారు. అయినా గడ్డం గీస్తే అడ్డంగా నరికేస్తామని నేరుగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో కొసాగిన అరాచక పాలనను మళ్లీ అమలులోకి తీసుకొచ్చారు తాలిబన్లు. కాబూల్‌లో తాలిబన్లు అడుగు పెట్టగానే ఆ దేశ ప్రజలు వేలాది మంది ఎందుకు పారిపోయారో ప్రపంచానికి ఇప్పుడర్థమవుతోంది. 1996 నుంచి 2001 వరకు కాలకేయుల…
అప్ఘనిస్తాన్ పై తాలిబాన్లు దురాక్రమణ చేయడంతో అక్కడి పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అప్ఘన్లో తామే ప్రభుత్వాన్ని నడిపిస్తామని ప్రకటించుకున్న తాలిబన్లు ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో దారుణంగా విఫలమవుతున్నారు. దీనికితోడు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తామని ప్రకటించడంతో తాలిబన్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అయితే గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్ఘన్లు అక్కడ బ్రతుకు జీవుడా అంటూ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరినీ తాలిబన్లు కిడ్నాప్ చేస్తారో? ఎవరిపై కాల్పులు జరుపుతారో తెలియక బిక్కుబిక్కుమంటూ…
ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ చీమ చిటుక్కుమన్న అగ్రరాజ్యం అమెరికాకు తెలిసిపోతుందని పేరుంది. అయితే ఇదంతా అమెరికా గత వైభవంగా కన్పిస్తుంది. అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లే అమెరికా ఇటీవల కాలంలో చాలా వైఫల్యాలను చవిచూస్తోంది. రాజకీయ కారణాలో లేక పరిపాలన దౌర్భాగ్యమో తెలిదుగానీ ఆ దేశానికి చెందిన నిఘా సంస్థలు సైతం ఇటీవల కాలంలో మెరుగైన పనితీరును కనబర్చడం లేదు. తాజాగా అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల తప్పుడు నిర్ణయంతో 10మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి…
తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకున్నాక పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయి. అప్ఘన్లో ఎక్కడ చూసినా.. ఎవరినీ కదిలించినా హృదయ విదారక సంఘటనలే దర్శనమిస్తున్నాయి. తమ దేశంలోనే పరాయివాళ్లలా పొట్టచేత బట్టుకొని జీవించాల్సిన దుస్థితి అప్ఘన్లకు రావడం నిజంగా శోచనీయమనే చెప్పాలి. తాలిబన్ల చెర నుంచి తమను రక్షించాలని నిస్సాహాయ స్థితిలో అఫ్ఘన్లు ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతానికి భిన్నంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు…
ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులు శాంతియుత నిరసన చేస్తున్నారు. ఆఫ్ఘానిస్థాన్ లో జరుగుతున్న సంఘటనలను ఖండిస్తూ అఫ్ఘానిస్థాన్ విద్యార్థుల నిరసన చేస్తున్నారు. తాలిబన్లు అరాచకాలు ను తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మహిళలకు రక్షణ కల్పించాలి, ఐక్యరాజ్యసమితి లో తాలిబన్లు కు రాజ్యం ఆమోదం వద్దని, పంజ్ షీర్ పోరాటానికి మద్దతుగా శాంతి యుత నిరసన చేపట్టారు. పాకిస్థాన్ వెంటనే తాలిబన్లకు సహకారం ఆపాలి డిమాండ్ చేసారు. అయితే గత నెలలో ఆఫ్ఘనిస్తాన్…
తాలిబన్ల దురాక్రమణతో అప్ఘనిస్తాన్ వారి హస్తగతమైంది. తమ పాలనను ఒప్పుకున్నారా సరే? లేదంటే ఖతం కావాల్సిందే? అన్నట్లుగా తాలిబన్ల వైఖరి ఉంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తాలిబన్ల ప్రభుత్వాన్ని అంగీకరించాల్సి వస్తోంది. అయితే ఇప్పటికే తాలిబన్ల అరాచక పాలన చూసిన మహిళలు మాత్రం వారి పాలనలో బతకడం కంటే చావడం మేలు అన్నట్లుగా ఉన్నారు. దీంతో దేశం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కారణంగానే ఆ దేశ బోర్డర్లో వేలాది మంది అఫ్ఘన్లు…
అగ్రరాజ్యం అమెరికా ‘సెప్టెంబర్ 11’ రోజును కలలో కూడా మర్చిపోలేదు. ఈరోజునే అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలతో దాడి చేశారు. ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించి అమెరికాకు సానుభూతి తెలిపాయి. ప్రపంచ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా మాత్రం అల్ ఖైదా ఉగ్రవాదులకు అఫ్ఘనిస్తాన్ కేంద్రంగా మారిదంటూ ఆ దేశంపై దాడి చేసి వారితో ప్రత్యక్ష యుద్ధానికి దిగింది. ఈక్రమంలోనే నాటి తాలిబాన్ ప్రభుత్వాన్ని అమెరికా నామరూపల్లేకుండా…