అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటుంన్నట్టు ప్రకటించిన తరువాత పూర్తిగా అక్కడి పరిస్థితులు మారిపోయాయి. అంత త్వరగా తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకుంటారని అనుకోలేదు. దీంతో దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆగస్టు 31 వరకు ఆఫ్ఘన్‌లోని అమెరికా పౌరులను, అమెరికా అధికారులను తరలించాలని సైన్యం టార్గెట్ పెట్టుకుంది. ఆగస్టు31 వరకు ఆ దేశాన్ని పూర్తిగా ఖాళీచేసి వచ్చేయాలని అమెరికా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆగస్టు 31 వరకు అది సాధ్యం కాకాపోవచ్చు. మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నది. ఈ సమయంలో తాలిబన్లు అమెరికాను హెచ్చరించారు. ఆగస్టు 31 వరకు దేశాన్ని విడిచి వెళ్లకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. దీనిపై అమెరికా ఇప్పటి వరకు స్పందించలేదు. ఒకవేళ ఆగస్టు 31 వరకు పూర్తిగా వైదొలగకుంటే తాలిబన్లు ఏంచేస్తారు. అమెరికా సైన్యంపై చర్యలు తీసుకుంటారా? లేదంటే వారిని బందిస్తారా?